రథసప్తమి రోజు చిక్కుడు లేదా జిల్లెడు.. ఆకులతో ఇలా చేస్తే శుభం..

తిరుమల తిరుపతి దేవస్థానానికి రథసప్తమి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు దేశ నలమూలాల నుంచి తరలివచ్చి స్వామి వారినీ దర్శించుకుంటూ ఉంటారు.

ఎందుకంటే మాఘ శుద్ధ రథసప్తమి రోజు శ్రీ వారు ఎన్నో రకాల వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.

రథసప్తమి రోజు ఈ పనులను చేస్తే శుభం జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

"""/"/ ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే రథసప్తమి రోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు పొందవచ్చని చెబుతున్నారు.

దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారు సూర్య భగవంతుని పూజించడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే రథసప్తమి రోజున ఏడు చిక్కుడు ఆకులను తల పై పెట్టుకుని మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలంటారు.

ఇంకా చెప్పాలంటే ఆవు పాలు, అన్నం, బెల్లం తో తయారు చేసిన పాయసం చిక్కుడు ఆకులు లేదా ఏదైనా పళ్లెంలో సూర్య భగవంతుడికి నైవేద్యం సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం పాటించడం మంచిది.అంతే కాకుండా నీటిలో బెల్లం వేసి అర్ఘ్యం సమర్పించాలి.

"""/"/ రధసప్తమి రోజు స్నానం చేసి అలాగే పూజ చేసిన తర్వాత పేద బ్రాహ్మణునికి పప్పు,బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయడం ద్వారా లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే పేద వారికి రథసప్తమి రోజు దానం చేయడం వల్ల ఆ ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఆ ఇంటి కుటుంబ సభ్యులు అంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారు.

అఖండ 2 తర్వాత నేనేంటో అందరికీ చూపిస్తా…. నన్ను చూసి నాకే పొగరు: బాలకృష్ణ