ర‌క్తాన్ని శుద్ధి చేసే సూప‌ర్ జ్యూస్ ఇది.. వారంలో 2 సార్లు తీసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్‌!

శ‌రీరంలోని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా పని చేయాల‌న్నా, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండాల‌న్నా, చ‌ర్మం నిగారింపుగా మెర‌వాల‌న్నా రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగా ఉండాలి.

అయితే ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల మన రక్తంలో మలినాలు పేరుకుపోతూ ఉంటాయి.

ఈ మ‌లినాల‌ను తొల‌గించి ర‌క్తాన్ని శుద్ధి చేసేందుకు ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివ‌ర్ నిరంత‌రం ప‌నిచేస్తూనే ఉంటాయి.

కానీ, కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోవ‌డం ఈ ప్ర‌క్రియ మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది.

అలాంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ జ్యూస్ కూడా ఒక‌టి.ఈ జ్యూస్‌ను వారంలో రెండంటే రెండు సార్లు తీసుకుంటే ర‌క్తం శుద్ధి అవ్వ‌డ‌మే కాదు మ‌రెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా త‌మ సొంత‌మ‌వుతాయి.

మరి ఇంత‌కీ ఆ జ్యూస్‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పది వేపాకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

అలాగే అర కప్పు కొత్తిమీర మరియు అర కప్పు పుదీనా ఆకులను తీసుకుని వాటర్ లో కడిగి పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న వేపాకులు, పుదీనా, కొత్తిమీర, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఈ జ్యూస్ లో చిటికెడు బ్లాక్ సాల్ట్, చిటికెడు మిరియాల పొడి, పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని తాగడమే.

ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ను సేవించాలి.వారంలో రెండు సార్లు ఈ జ్యూస్ తీసుకుంటే మలినాలన్నీ తొలగిపోయి ర‌క్తం శుద్ధి అవుతుంది.

అంతేకాదు, ఈ జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

మ‌రియు బ‌రువు కూడా త‌గ్గుతారు.

ఒళ్ళు బలిసి ఈ వీడియో పెట్టాను.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!