ఇది శాంపిల్ మాత్రమే: కేటీఆర్

తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఒక శాంపిల్ మాత్రమేనని తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి ఆదర్శమయే రోజు తొందరలోనే ఉందని సెలవిచ్చారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మరియు బారాసా జాతీయ కార్యదర్శి కే.

టి.రామారావు( K.

T.Rama Rao ) .

నానక్ రామ్ గూడా లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడాయ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు, బారాసా కంటే మంచి రాజకీయాలు చేస్తున్న పార్టీ ఏ రాష్ట్రంలో ఉందో చూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఆయన సవాలు చేశారు.

ప్రధాని మోడీకి తమకు రాజకీయం గా పడదని వ్యాపారవేత్తలకు లక్షల్లో కోట్ల రూపాయల రుణమాఫీ చేసే ఆయనకు తెలంగాణ రైతాంగం మాత్రం కనిపించదని వారికి కరెంటు మీటర్లు బిగించమని ఆదేశాలు ఇస్తారని ప్రాణం పోయినా రైతు వ్యతిరేక నిర్ణయాలను తమ అధ్యక్షుడు కేసీఆర్( CM KCR ) తీసుకోరని ఆయన పునరుద్ఘాటించారు.

"""/" / అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నాం తప్ప అవినీతి కోసం కాదని అభివృద్ధి ఫలాలతో అప్పులను తీరుస్తామని అన్ని ప్రభుత్వాలు ఇలానే చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదని, అసలు జీవితమే శాశ్వతం కాదని ఆయన హితవు పలికారు.

ప్రధాని మోదీ( Narendra Modi )తో వ్యక్తిగతంగా తమకు ఏ విభేదాలు లేవని ఆయన రాజకీయ విధానాల పట్ల మేము అభ్యంతరం చెబుతున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / తాము చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రతిపక్షాలకు క్లారిటీ లేకపోయినా పర్వాలేదని ఆ క్లారిటీ ప్రజలకు ఉందని ,తమకు మేలు చేస్తున్న వారిని గుర్తుంచుకునే మనస్తత్వం సాధారణ ప్రజలకు ఉంటుందని, వచ్చే ఎన్నికలలో తాము కచ్చితంగా 90 నుంచి 100 సీట్లు గెలుస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురైనానని ఆయన తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తెలిపారు .

వారానికి 2 సార్లు ఉడికించిన శనగలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు పొందొచ్చో తెలుసా?