అయితే సీజనల్ గా వచ్చే దగ్గును తరిమి కొట్టే ఔషధాలు మన వంటింట్లోనే ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా దగ్గు పరార్ అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా అంగుళం అల్లం(Ginger) ముక్కను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ ధనియాలు (Coriander)వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను వన్ స్పూన్ టేబుల్ చొప్పున ఉదయం మరియు సాయంత్రం తీసుకోవాలి.
"""/" /
అల్లం మరియు ధనియాలు కాంబినేషన్ దగ్గును తగ్గించడంలో చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని కనుక పాటించారంటే దగ్గు కేవలం రెండు రోజుల్లోనే తగ్గుముఖం పడుతుంది.
కఫం ఉంటే కరిగిపోతుంది.జలుబు సమస్య నుంచి కూడా రిలీఫ్ పొందుతారు.
ఇక చాలా మంది జలుబు చేసిన, దగ్గు వేధిస్తున్న వాటర్ సరిగ్గా తీసుకోరు.
కానీ నీళ్లు ఎక్కువగా తాగడం దగ్గుకు మంచిది.నీళ్లు తాగడం వల్ల కఫం పల్చబడి బయటకు వెళ్లిపోతుంది.