షర్మిల అలా చేయడం రాజకీయ తప్పిదమే .. విజయసాయిరెడ్డి విమర్శలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై( YS Sharmila ) వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి( Vijayasai Reddy ) విమర్శలు చేశారు.

ప్రస్తుతం షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.పార్టీని బలోపేతం చేయడంతో పాటు, తన అన్న జగన్( Jagan ) వైసీపీని టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతున్నారు.

వైఎస్సార్ కి జగన్ వారసుడు కాదని, కేవలం ఆయన ఆస్తులకే వారసుడంటూ షర్మిల విమర్శలు చేస్తున్నారు.

రాజకీయ వ్యక్తిగత విమర్శలతో జగన్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.షర్మిల చేస్తున్న విమర్శలు అన్ని విధాలుగా జగన్ కు, వైసీపీ కి డామేజ్ కలిగిస్తూ ఉండడంతో, షర్మిల పై వైసీపీ కీలక నాయకులంతా విమర్శలు చేస్తున్నారు.

షర్మిల చంద్రబాబు దత్తపుత్రిక అని, చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ జగన్ ను టార్గెట్ చేస్తుందని వైసిపి నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.

"""/" / తాజాగా షర్మిల చేస్తున్న విమర్శలపై విజయ సాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు.

ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా షర్మిల వ్యవహారంపైస్పందించారు.

జగన్ తో షర్మిల రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమేనని, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు షర్మిలను తాము ఏమీ అనలేదని, ఏపీకి వచ్చి కాంగ్రెస్ లో( Congress ) చేరడం మాత్రం షర్మిల చేసిన రాజకీయ తప్పిదం అని విజయ సాయి రెడ్డి విమర్శించారు.

ఎన్డీఏలో చేరిక పైన విజయసాయిరెడ్డి స్పందించారు. """/" / ఎన్డీఏలో( NDA ) చేరాలని తమ పార్టీకి 2014లోనే ఆఫర్ వచ్చిందని, దానికి తాము నిరాకరించినట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఆ తరువాతే బీజేపీ టిడిపితో జత తట్టిందని, వైసీపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అంశాల వారీ గానే గతంలో ఎన్డీఏకు తాము మద్దతు పలికామని, కానీ పూర్తిగా ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేమని విజయ సాయి రెడ్డి అన్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?