మంచినీళ్లు తాగాడని కొట్టి చంపడం అనాగరిక చర్య

సూర్యాపేట జిల్లా:కేంద్రంలో బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దళితులకు రక్షణ పూర్తిగా కరువైందని మంచినీళ్ల కుండను ముట్టుకున్నాడని రాజస్థాన్ లో తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మేగ్వాల్ ను మట్టుబెట్టిన హంతక టీచర్ ను కఠినంగా శిక్షించాలని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.

బుధవారం ఖమ్మం క్రాస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ రాష్ట్ర కమిటి పీలుపులో భాగంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న వేళ దేశమంతా వజ్రోత్సవాలు జరుపుతున్న సందర్భంలో కుల,మతం మతోన్మాదం వంటి దుర్మార్గాలు కొనసాగడం సిగ్గుచేటన్నారు.

కేంద్ర బీజేపీ పాలన దళిత వ్యతిరేకులదని మరోసారి రుజువు చేసిందన్నారు.రాజస్థాన్ రాష్ట్రంలో దళిత వర్గానికి చెందిన తొమ్మిదేళ్ల ఇంద్ర మేఘ్వాల్ అనే బాలుడు ఉన్నత కులాల ఉపాధ్యాయుల కోసం కేటాయించిన తాగు కుండలోని నీటిని తాగినందుకు ఆ ఉపాధ్యాయుడు కొట్టడంతో మరణించాడని ఈ దారుణ ఘటనపై ప్రధాన మంత్రి ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.

భారతీయ విద్యా వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా మనువాద చాందస భావాలతో ఉందన్నారు.అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులను సామాజిక రుగ్మతలు నుండి ఎప్పుడు విముక్తి చెందుతారని విమర్శించారు.

రాజస్థాన్‌లో జరిగిన సంఘటన కులతత్వానికి,అంటరానితనానికి మరో ఉదాహరణ తప్ప మరొకటి కాదన్నారు.ఆజాది క అమృత్ మహిత్సవం ఒకవైపు జరుగుతుండగా అంటరానితనం మరో వైపు కొనసాగడం శోచనీయమని చెప్పారు.

భారత స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా,దళితులు మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాలు వారు "స్వేచ్ఛ"ను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజస్థాన్ జిల్లాలో దళితమహిళా టీచర్ పాఠశాలకు వెళ్తుండగా కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంఘటన జరిగిందన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా దళితుడి ఇంట్లో టీ అని ఫోజులు ఇస్తారని,కానీ,దళితులపై అమానుష దాడి కొనసాగిస్తారని విమర్శించారు.

రాజస్థాన్ లో ఇంద్ర కుమార్ అనే దళిత విద్యార్థి హత్య,మరియు దళిత మహిళ టీచర్ సజీవ దహనం దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు,పట్నం జిల్లా కన్వీనర్ జె.

నర్సింహారావు, ఆవాజ్ జిల్లా కార్యదర్శి జహంగీర్, కేవీపీఎస్ జిల్లా నాయకులు కొండేటి ఉపేందర్,గుంటూరు రమేష్, సూర్యతేజ,నాయక్,మాలమహనడు జిల్లా అధ్యక్షులు రవి,నాయకులు కోడిరెక్కఏడుకొండలు,మోహన్, సతీష్,మైనార్టీ నాయకులు సాజిత్,రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!