డిసెంబర్ 31 లోపు అలా చేయాల్సిందే.. పాన్ కార్డ్ కొత్త రూల్స్..

ఆర్థిక మోసాలను నివారించడానికి భారత ప్రభుత్వం పాన్ కార్డుదారులందరికీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా డిసెంబర్ 31, 2024లోగా ప్రజలు తమ పాన్ కార్డులు, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని ప్రజలకు తెలిపింది.

అలా చేయడంలో విఫలమైతే సంబంధిత పాన్ కార్డ్ (PAN CARD)డియాక్టివేట్ అవ్వడం లేదా ఇతర సమస్యలు ఏర్పడవచ్చునని అధికారులు తెలిపారు.

అనేక ఫైనాన్ కంపెనీలు మన అనుమతి లేకుండా కస్టమర్ ప్రొఫైల్‌లను సృష్టించడానికి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తాయి.

గోప్యతా కారణాలతోనే కాకుండా ఆర్థిక మోసాల(Financial Fraud) కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సెన్సిటివ్ పర్సనల్ డేటా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పాన్ ద్వారా వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పరిమితం చేయాలని ఆదాయపు పన్ను శాఖను హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

డిసెంబరు 31లోపు(December 31) మీ ఆధార్ కార్డ్‌ని మీ పాన్ కార్డ్‌తో లింక్ చేయడంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు.

రెండు కార్డ్‌లను లింక్ చేయలేకపోతే, పాన్ కార్డ్ ఇకపై చెల్లదు.మీరు తదుపరి లావాదేవీలతో సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా.

ట్రేడింగ్‌ సంబంధించిన విషయాలు పునఃప్రారంభించడం కూడా కష్టమవుతుంది.గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

"""/" / గత సంవత్సరము కాలం నుండి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై అనేకమార్లు గడుపు పొడిగిస్తూనే వస్తుంది.

అయితే ఈసారి ఎలాంటి గడువుకు చోటు ఇవ్వకుండా కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాబట్టి, వీలైనంత త్వరగా ఎవరైతే పాన్ కార్డు - ఆధార్ కార్డు లింక్ చేయలేని వారు వీలైనంత త్వరగా పనిని పూర్తిచేస్తే అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.