ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికీ మూడు సంవత్సరాలు కావడంతో సీఎం జగన్ ఎమోషనల్ పోస్ట్

2019 ఎన్నికలలో తిరుగులేని విజయంతో గెలిచిన వైయస్ జగన్ నేటికి సీఎం బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు చేయడం జరిగింది.

2019 మే 30 వ తారీకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో సీఎం బాధ్యతలు జగన్ చేపట్టారు.

దీంతో నేటికి మూడు సంవత్సరాలు ముగియటంతో జగన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది.

మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం.

ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం.రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా.

మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా" అని చెప్పుకొచ్చారు.

పరోక్షంగా ప్రజలకు నేను సేవకుడిని అని సీఎం జగన్ తనదైన శైలిలో రాసుకొచ్చారు.

 ఈ సందర్భంగా వైసిపి పార్టీ కార్యకర్తలు.సీఎం పదవి జగన్  చేపట్టి మూడు సంవత్సరాలు.

కావడంతో సోషల్ మీడియాలో తమదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు.

దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని డబ్బులు ఇచ్చారు….పూల చొక్కా నవీన్ షాకింగ్ కామెంట్స్!