Mahesh Babu , Allu Arjun : ఎన్నో ఏళ్లుగా సైలెంట్ గా కొనసాగుతున్న మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ వివాదం.. ఇప్పుడు కూడా బన్నీ వదలలేదుగా ?

గుంటూరు కారం సినిమా ( Guntur Karam Movie )విడుదల అయింది.ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది త్రివిక్రమ్ ఫెయిల్యూర్ కాదు, మహేష్ బాబు గ్రాఫ్ పడిపోవడం అంతకన్నా కాదు, థమన్ కాఫీ కంటెంట్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, దిల్ రాజు( Dil Raju ) కి కొట్టిన షాక్ కూడా పక్కన పెడితే ఇప్పుడు మరొక విషయం ట్రెండింగ్ లో ఉంది.

అదే అల్లు అర్జున్( Allu Arjun ) రాంగ్ టైమింగ్ లో వచ్చిన ట్వీట్ గురించి.

అలా వైకుంఠపురం లో చిత్రానికి నాలుగేళ్లు పూర్తిగా సందర్భంగా టీమ్ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఆ స్వీట్ మూమెంట్ గురించి పంచుకున్నాడు.

అయితే సరిగ్గా అదే టైంకి గుంటూరు కారం సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుని టీం అంతా కూడా నిరాశలో ఉన్నారు.

"""/" / సరే ఈ ట్వీట్ మహేష్ బాబుని( Mahesh Babu ) ఇన్ డైరెక్ట్ గా గెలికినట్టుగానే ఉంది.

మహేష్ బాబు నిరాశలో ఉన్న టైంలో తన ఆనందాన్ని పంచుకోవడానికి ఇబ్బందికి సందర్భం దొరకడమే నిజంగా చాలా మందిని షాక్ కి గురిచేస్తుంది.

చాలా ఏళ్లుగా మహేష్ బాబుకి అల్లు అర్జున్ కి పడటం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే.

మొన్నటికి మొన్న గుణశేఖర్ కూతురు పెళ్లిలో కూడా ఈ విషయం స్పష్టం అయింది.

"""/" / మొదటగా మహేష్ బాబు గుణశేఖర్( Gunasekhar ) కూతురిని కంగ్రాట్యులేట్ చేయడానికి ఈ స్టేజి పైకి ఎక్కగా, ఆ వెనకాలే అల్లు అర్జున్ కూడా వచ్చాడు.

ఒకరినొకరు స్టేజ్ పై చూసుకొని చాలా క్యాజువల్ గా షేక్ హ్యాండ్ అయితే ఇచ్చుకున్నారు కానీ ఆ టైంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన టీం అంతా కూడా అక్కడ ఏదైనా జరుగుతుందేమో అనే భయంతో స్టేజ్ పైకి ఎక్కేశారు.

సాధారణంగా అక్కడ మహేష్ బాబు కాకుండా మరొక హీరో ఎవరున్నా కూడా అల్లు అర్జున్ హగ్ చేసుకుని చాలాసేపు నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవారు కానీ మహేష్ కాబట్టి చాలా క్యాజువల్ గా ఒక షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

"""/" / సమయం వెనక్కి వెళితే 2020 సంక్రాంతికి అల్లు అర్జున్ వర్సెస్ మహేష్ బాబు ఫైట్ బీభత్సంగా జరిగింది.

అల్లు అర్జున్ అలా వైకుంటపురం లో సినిమాతో సంక్రాంతికి సందడి చేయగా అదే టైంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ( Sarileru Neekevvaru Movie )చిత్రంతో సంక్రాంతి ఫైట్ లో నిలిచాడు.

ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్ గా జరిగాయి.ఈ సందర్భంగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దూషించుకున్నారు.

ఈ సంఘటనని ఇద్దరు హీరోలు చాలా బ్యాలెన్సుడ్ గా మేనేజ్ చేసినప్పటికీ అప్పటి నుంచి జరుగుతున్న ఈ వార్ ఇంకా ముగిసి పోలేదు.

ఈ టైంలో మళ్లీ అల్లు అర్జున్ తన పాత చిత్రం నాలుగేళ్లు గడిచింది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేయడం మహేష్ బాబుని ఇన్ డైరెక్ట్ గా వెటకారంగా టీజ్ చేసినట్టుగానే ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన తారక్.. మంచి మనస్సంటూ?