మరి కాసేపటిలో నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య ఎల్ -1

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.చంద్రయాన్ -3 విజయవంతం కావడంతో ఇస్రో సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు గానూ ఆదిత్య ఎల్-1 ను ప్రయోగించనుంది.

ఈ మేరకు పీఎస్ఎల్వీసీ -57 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.ఈ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభం కాగా ఇవాళ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రాకెట్ ను శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు.

సూర్యుడి వాతావరణాన్ని అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహంతో పీఎస్ఎల్వీసీ -57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం నాలుగు నెలల పాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ఎల్ 1 పాయింట్ ను చేరుకోనుంది.

ఇది భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.అయితే ఇంత దూరం ఇస్రో ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఫేక్ రికార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?