ఇజ్రాయెల్‌కు వేలాది మంది భారతీయ శ్రామికులు .. అన్ని లాంచనాలు క్లియర్, వచ్చేవారమే రిక్రూట్‌మెంట్

ప్రస్తుతం హమాస్ ఉగ్రవాద సంస్థతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టి పరిస్ధితుల్లోనూ హమాస్‌ను నాశనం చేయాలనే కృత నిశ్చయంతో వున్న ఇజ్రాయెల్( Israel ) గాజాను దిగ్భంధించింది.

గాజాకు రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది.ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ను కార్మిక కొరత వేధిస్తోంది.

యుద్ధానికి ముందు గాజా నుంచి ఇజ్రాయెల్‌లో భవన నిర్మాణ పనులు, ఇతర పనుల ద్వారా దాదాపు 80 వేల మంది వెస్ట్‌బ్యాంక్‌కు( West Bank ) చెందిన పాలస్తీనియన్లు , గాజాకు చెందిన 17 వేల మంది ఉపాధి పొందారు.

ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ కమ్మేయడంతో వారికి ఉపాధి కరువైంది. """/" / ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వర్క్ ఫోర్స్‌ను ఎలా భర్తీ చేయాలనేది నెతన్యాహూ ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకొచ్చింది.

ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్‌తో సంప్రదింపులు జరుపుతోంది.చట్టపరమైన క్లియరెన్స్‌‌ను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

డిసెంబర్ చివరి వారంలోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.దీనిలో భాగంగా ఇప్పటికే ఓ బృందం భారత్ చేరుకోగా.

వచ్చే వారం మరో టీమ్ రానుంది. """/" / భారత కార్మికుల( Indian Workers ) నియామక ప్రక్రియపై ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది.

డిసెంబర్ 27 నుంచి ఢిల్లీ, చెన్నైలలో కార్మికుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలుపెడతామని పేర్కొంది.

ప్రభుత్వం అనుమతించిన మేరకు తొలి విడతలో 10 వేల మందిని నియమించుకుంటామని.ఆపై దానిని 30 వేలకు పెంచుతామని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్( Israel Builders Association ) తెలిపింది.

ఈ ప్రక్రియ మొదలై 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనుంది.ఈ విధంగా మొత్తంగా లక్షా 60 వేల మందిని నియమించుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు.అందులోనూ ఎక్కువ మంది హెల్త్ కేర్ విభాగంలోనే సేవలందిస్తున్నారు.

తాజా కార్మికుల సంక్షోభం నేపథ్యంలో దాదాపు 42 వేల మంది భారతీయులను నియమించుకునేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగింది.

రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు.