జూనియర్ ఎన్టీఆర్ నటనపై ఇజ్రాయెల్ మీడియా ప్రశంసలు
TeluguStop.com
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్.రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఓ ప్రభంజనమనే చెప్పాలి.
బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది.స్నేహం ప్రధాన అంశంగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్.
సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.యాక్షన్ ఘట్టాలు, పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఫిదా చేశాయి.
మార్చి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించిందనే చెప్పాలి.రికార్డులను తిరగరాసింది.
ఆర్‌ఆర్‌ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.జూనియర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్రలో నటించి మెప్పించాడు.
వీరిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఒకరికి మించి మరొరకు కుమ్మేశారు.
విమర్శలు, సినీ విశ్లేషకులు వీరిద్దరి నటనకు జై కొట్టారు.దేశం మొత్తం ఈ చిత్రాన్ని చాలా ఆదరించింది.
సౌత్, నార్త్ భేదం చూపించకుండా అక్కడి ప్రజలు కూడా ఆర్‌ఆర్‌ఆర్ విజయవంతం చేశారు.
ఇక సినిమాలో తారక్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.చరణ్ తో కలిసి పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్ కుమ్మేశాడు.
కొమురం భీముడో పాటలో అయితే కన్నీరు పెట్టించేశాడు.ఈ పాటలో చరణ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను కొడుతున్నప్పుడు చాలా మంది ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లుతాయి.
ఇందులో నటనతో ఇరగదీశాడు తారక్. """/" /
ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో జూనియర్ నటనపై ఇజ్రాయెల్ మీడియా ప్రశంసలు కురిపించింది.
కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనను హైలెట్ చేస్తూ ఫుల్ పేజీ ఆర్టికల్ రాసింది.
నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ హిందీ వర్షన్‌ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అర్థం చేసుకుని మరీ ప్రశంసించింది.
ఈ క్లిప్పింగ్‌ను ఎన్టీఆర్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనట.. గేమ్ ఛేంజర్ ను మించి బాలయ్య మెప్పిస్తాడా?