వావ్.. ఆ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా ఇజ్రాయిల్..?! అసలు మ్యాటర్ ఏంటంటే..
TeluguStop.com
దేశ భూభాగంలో సగానికి పైగా ఎడారి ప్రాంతం.అక్కడి వాతావరణం కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు.
అసలే నీళ్లు లేని ప్రాంతం.అక్కడి భూభాగంలో 20% మాత్రమే సాగుకు అనుకూలంగా ఉంటుంది.
కానీ., ఆ దేశ ప్రజల పట్టుదల.
సేద్యంలో వినూత్న ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొన్న తీరుతో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది ఇజ్రాయిల్.
ఆ దేశ ప్రజలు సేంద్రీయ సేద్య విధానాలలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఎడారి నేలల్లో సాగుకు సంబంధించి కొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిన ఇజ్రాయిల్ వ్యవసాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇజ్రాయిల్ లో వ్యవసాయం ముఖ్యంగా రెండు పద్ధతుల్లో చేస్తారు.మొదటిది సామూహికంగా పంట ఉత్పత్తి చేయడం.
అంటే ఒక కమ్యూనిటీ, ఊరు లేదా ప్రాంతం అంతా కలిసి సామూహికంగా పంట ఉత్పత్తి చేస్తారు.
దీనిని కిబడ్జ్ అని అంటారు.ఇక రెండోది మోషన్ పద్ధతి.
ఇందులో ఒక కుటుంబం తన సొంత భూమిలో వ్యవసాయం చేస్తుంది.ఇజ్రాయిల్ లో ఎక్కువగా పండ్లు కూరగాయలను సాగు చేస్తారు.
నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయలు, యాపిల్, నేరేడు పండ్లు, పీచు, మామిడి రేవు మరియు బెర్రీస్ ముఖ్యంగా సాగు చేసే పండ్లు.
ఇజ్రాయిల్ మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఏకంగా 8 బిలియన్ డాలర్లు కాగా.
"""/" / 2014లో పండ్లు, కూరగాయలు ఉత్పత్తుల విలువ 3 బిలయన్ డాలర్లు.
ఇజ్రాయిల్ దేశం ప్రారంభించిన డ్రిప్ మైక్రో ఇరిగేషన్ ని ఇప్పుడు ప్రపంచం మొత్తం వాడుతోంది.
డ్రిప్ ఇరిగేషన్ లో నీటి నాణ్యణతో సంబంధం లేకుండా ఏకరీతి నీటి ప్రవాహం ఉండేటట్లుగా అభివృద్ధి చేశారు.
అంతేకాదు.వేడి, పొడి వాతావరణంలో సాగు చేయగలిగే, ఉప్పు నీటి ద్వారా సేద్యం చేయగలిగే బంగాళదుంప జాతులను అభివృద్ధి చేశారు.
టమోటాలను రుచికరంగా చేసేందుకు కొత్త రకం టమాటాల ఉత్పత్తి, చెట్లకు 50% నీటిని తగ్గించడం, జీవసంబంధమైన తెగులు నియంత్రణకు ఉపయోగపడే కీటకాలు, పురుగుల పెంపకం వంటి చర్యల ద్వారా ఉత్పత్తి పెరిగింది.
"""/" /
ఇజ్రాయిల్ దేశం వ్యవసాయం కోసం శుద్ధి చేసిన మురికి నీటిని పునర్వినియోగం చేస్తోంది.
నీటి వనరుల కొరత, పొడి వాతావరణం ఉన్నందున డీ సాలినేషన్ ప్లాంట్ ని ఉపయోగించుకుంటోంది.
లీకేజ్ లను కనిపెట్టడం, నీటి వృథాని అరికట్టడం కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, కంప్యూటరీకరించిన బిందు సేద్యం, మైక్రో స్పింక్లర్లను ఉపయోగిస్తోంది.
ఇక శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంలో ఇజ్రాయిల్ దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.
అధునాతన టెక్నాలజీ ద్వారా నీటి మిగులు దేశంగా ఇజ్రాయిల్ అవతరించింది.
ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను…స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!