ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 15000 దాటిన మరణాలు..!!

ఇజ్రాయెల్.గాజా మధ్య యుద్ధం మొదలై రెండు నెలలు కావస్తోంది.

అక్టోబర్ 7వ తారీకు హమాస్ మిలిటెంట్ లు.( Hamas ) ఇజ్రాయెల్( Israel ) భూభాగంలో అక్రమంగా చొరబడి పౌరులపై.

సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు.ఇజ్రాయెల్ పౌరులను 200 మందికి పైగా బందీలుగా అపహరించడం తెలిసిందే.

దీంతో ఇజ్రాయెల్ సైనిక దళాలు.గాజా పట్టణం పై( Gaza ) విరుచుకుపడుతూ ఉన్నాయి.

అక్కడ ఉన్న హమాస్ మిలిటెంట్ స్థావరాలపై బాంబులతో దాడులు చేస్తూన్నారు.కాగా ఇటీవల కాల్పుల విరమణ అంగీకారంతో కొంతమంది బందీలను హమాస్ విడుదల చేయడం జరిగింది.

"""/" / దీంతో మొన్నటి వరకు మూడు రోజులు పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్( IDF ) గాజా పై ఎటువంటి దాడులు చేయలేదు.

ఇటీవల ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ముగియటంతో మళ్లీ యుద్ధం మొదలయ్యింది.

ఈ క్రమంలో దాదాపు 15,200 మందికి పైగా మరణించినట్లు స్థానిక ఆరోగ్య విభాగం స్పష్టం చేసింది.

మృతులలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది.అంతేకాదు సుమారు 40000 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది.

"""/" / మరణాల సంఖ్య ఉండే కొద్ది పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది.

దాదాపు రెండు నెలల నుండి జరుగుతున్న ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ లో( Middle East ) భయంకర వాతావరణం సృష్టిస్తుంది.

ఒకపక్క ఇజ్రాయెల్.మరోపక్క హమాస్ రెండు వెనక్కి తగ్గటం లేదు.

ఈ క్రమంలో అగ్రరాజ్యాలైన అమెరికా ఇంకా పలు దేశాలు సైతం.శాంతిని నెలకొల్పటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు.

ఇజ్రాయెల్.హమాస్ యుద్ధం( Israel Hamas War ) తీవ్రతరమైతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఒహియో సెనేట్ సీటుపై వివేక్ రామస్వామి కన్ను? .. ట్రంప్‌తో మంతనాలు అందుకేనా?