వీడియో వైరల్‌.. హమాస్‌ అధినేత సిన్వర్‌ చివరి క్షణాలు ఇలా

గత కొన్ని రోజులుగా ఇజ్రాయిల్లో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌( Hamas ) కు పెద్దదెబ్బె ఎదురయ్యింది.

ఈ దాడుల్లో మిలిటెంట్‌ గ్రూప్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ ఇటీవల మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే అతడి మరణం కంటే ముందు సిన్వర్‌( Yahya Sinwar ) చివరి కదలికలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వాస్తవానికి ఈ కదలికలు అన్ని ఇజ్రాయిల్ డ్రోన్ కెమెరాలో రికార్డు అయినట్లు తెలుస్తుంది.

ఒక శిధిలా భవనంలోని సోఫాలో సిన్వర్‌ కూర్చుని ఉండగా డ్రోన్ వీడియోలు తీసినట్లు తెలుస్తోంది.

ఇది గమనించిన అతడు ఒక కర్రలాంటి వస్తువును డ్రోన్ వైపుగా విసరడం మనం వీడియోలో చూడవచ్చు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ వారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

"""/" / ఇక ఈ సంఘటనపై ఇజ్రాయిల్ మిలిటరీ అధికారి డేనియల్‌ హగారీ ప్రస్తావిస్తూ.

‘‘శిథిలమైన భవనం లోపల హమాస్‌ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా.? అనేది తెలుసుకునేందుకు డ్రోన్‌ను పంపించాం.

తొలుత ఆ వ్యక్తిని సిన్వర్‌ అనుకోలేదు.కేవలం మిలిటెంట్‌ అనే భావించాం.

ఆ తర్వాత భవనంపై మరోసారి బాంబు దాడి చేశాం.దీంతో భవనం కుప్పకూలి అతడు మరణించాడు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వర్‌ అని తెలిసిందని., అతడి శరీరంపై బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌, గ్రనేడ్లు ఉన్నాయని’ తెలియజేశాడు.

"""/" / ఈ క్రమంలో దక్షిణ గాజాలో( Gaza ) ముగ్గురు హమాస్ ను మిల్ట్రియన్లు ఇజ్రాయిల్ సైన్యం హతమార్చినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా ఇందులోని ఒక వ్యక్తి సిన్వర్‌ పోలికలు ఉన్నాయని ఐడిఎఫ్ గుర్తించింది.ఈ క్రమంలో డిఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు సమాచారం.

గతంలో కూడా సిన్వర్‌ ఇజ్రాయిల్ కస్టడీలో ఉన్న సమయంలో సేకరించిన డిఎన్ఏ నమూనాలను వీటిని పరీక్షించి అతడి మరణాన్ని కన్ఫామ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

త‌ల‌లో చుండ్రు క‌నిపించ‌కూడ‌దంటే ఈ టిప్స్ ను పాటించండి!