హిందీలో రీమేక్ అవుతున్న పూరీ ఇస్మార్ట్ శంకర్
TeluguStop.com
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా హిందీలోకి రిలీజ్ అవుతున్నాయి.కొన్ని సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాయి.
అందులో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ముందు వరుసలో ఉంటుంది.ఇదే దారిలో ఆర్ ఎక్స్ 100, జెర్సీ సినిమాలు కూడా ఉన్నాయి.
అలాగే భీష్మ సినిమా కూడా రీమేక్ కాబోతుంది.ఇదే దారిలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ కూడా రీమేక్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు పూరీ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ కూడా హిందీ రిలీజ్ కాబోతుంది.
వరుస ఫ్లాప్ లతో ఉన్న పూరీకి ఈ సినిమా మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చి ట్రాక్ లోకి తీసుకొచ్చింది.
ఇక రామ్ కూడా కెరియర్ లో మొదటి సారి డిఫరెంట్ లుక్ ట్రై చేసి మంచి కమర్షియల్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.
గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన పోకిరి హిందీతో పాటు సుమారు అన్ని ప్రాంతీయ భాషలలో రీమేక్ అయ్యింది.
ఆ తరువాత ఆ స్థాయిలో పూరీ సినిమాలు హిందీలో రిలీజ్ కాలేదు.మళ్ళీ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా హిందీ నిర్మాతలని మెప్పించింది.
దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని రీమేక్ కి రెడీ అవుతున్నారు.
ఇందులో ఈ మధ్య వరుస ఫ్లాప్ లతో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తాడని టాక్ వినిపిస్తుంది.
అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.ఇదిలా ఉంటే పూరీ పాన్ ఇండియా సినిమాగా విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
దీని మీద బాలీవుడ్ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ట్రంప్ ఆ ప్లాన్ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!