ఇస్మార్ట్‌ బ్యూటీకి ఇంకా ఎన్నాళ్లకు స్టార్‌ స్టేటస్‌

అక్కినేని హీరోలు నాగచైతన్య మరియు అఖిల్‌ లతో సవ్యసాచి మరియు మిస్టర్‌ మజ్ను సినిమాలు చేసిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో సక్సెస్ ను దక్కించుకుంది.

రామ్‌ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా సక్సెస్‌ అయినా కూడా నిధి అగర్వాల్ కు స్టార్‌ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు.

రష్మిక మందన్నా.పూజా హెగ్డే మాదిరిగా సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌ గా పేరును దక్కించుకునేందుకు ఈమె చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈమెకు ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి.

ఎట్టకేలకు ఈ అమ్మడికి క్రిష్‌ అదృష్టం కొద్ది హరి హర వీరమల్లు సినిమాలో ఆఫర్‌ ఇచ్చాడు.

ఆ ఆఫర్ కాస్త కరోనా వల్ల ఆలస్యం అవుతుంది.పవన్ తో మూవీ తర్వాత ఖచ్చితంగా స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిపోతాను అనే నమ్మకంతో ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి నిరాశ తప్పేలా లేదు.

"""/"/ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుంది.షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి చాలా ఆలస్యం అవుతుందని అంటున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్‌ అన్నా కూడా విడుదల వాయిదా పడుతుందని కొందరు అంటున్నారు.

విడుదల వాయిదా పడ్డా పడకున్నా కూడా హరి హర వీరమల్లు సినిమా లో ఆమె పాత్ర గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది.

హరిహర వీరమల్లు సినిమాలో ఈమె పాత్ర కేవలం 25 నుండి 30 నిమిషాలు మాత్రమే ఉంటుందట.

అందుకే ఈ అమ్మడికి హరి హర వీరమల్లు సినిమా లో కూడా స్టార్‌ స్టేటస్ ను తీసుకు వస్తుందో లేదో అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

పవన్‌ తో సినిమా చేసిన హీరోయిన్స్ కొద్ది మందికి మాత్రమే సక్సెస్‌ దక్కింది.

ఆ హీరోయిన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్‌ ట్రాక్‌ లో ఉన్నారు.మరి ముద్దుగుమ్మ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ కు ఎప్పటికి సక్సెస్ దక్కేనో చూడాలి.

కొరియన్ భర్తకి పరీక్ష పెట్టిన ఇండియన్ భార్య.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..