శంఖాలతో దీవి నిర్మాణం.. దాని విశేషాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

సాధారణంగా ఒక దీవి అనగానే మనకు చుట్టూ నీళ్లు మధ్యలో భూభాగం గుర్తుకు వస్తుంది.

కానీ ఒక దీవి పేరు చెప్పగానే అమెరికా ప్రజలకు శంఖాలే గుర్తుకొస్తాయి.ఎందుకంటే ఈ దీవి నేలతో ఏర్పడిన సహజమైన దీవి కాదు.

దీనిని సముద్రంపై 12 అడుగుల ఎత్తులో శంఖాలతో నిర్మించారు.ఏకంగా ఒక దీవిని శంఖాలతో నిర్మించడం అంటే మామూలు విషయం కాదు కదా! అందుకే ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరి ఈ ద్వీపం ప్రత్యేకత ఏమిటో మనమూ తెలుసుకుందామా.ఉత్తర, దక్షిణ అమెరికా మధ్య భాగంలో తూర్పు దిక్కు లో కరేబియన్ దీవులు ఉంటాయి.

ఆ దీవుల్లో బ్రిటిష్ వర్జిన్ దీవులు.వాటిలో అనెగాడా అనే మరికొన్ని దీవుల సముదాయం ఉంటుంది.

ఈ దీవుల సముదాయం లోనే మనకు శంఖాల దీవి కనిపిస్తుంది.దీన్ని అనెగాడా కోంచ్ మిడ్డెన్స్ (anegada Conch Middens) అని పిలుస్తారు.

ఇక్కడ కనిపించే శంఖాల బరువు రెండు నుంచి మూడు కిలోల పైమాటే అంటే అతిశయోక్తి కాదు.

ఇది మానవ నిర్మితమైన ద్వీపమే అయినప్పటికీ.ప్రకృతి సిద్ధమైన శంఖాలతో దీనిని కట్టడంతో ఇది ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.

అందుకే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని చూసి అబ్బురపడుతుంటారు.మత్స్యకారులు 13వ శతాబ్దం నుంచే శంఖాలను సముద్రంపై కుప్పలుగా పోస్తున్నారు.

దీనిని నిర్మించడానికి ఇప్పటికే వారు కుప్పలు తెప్పలుగా సముద్రంపై కుమ్మరించారు.అయితే స్థానికుల ప్రకారం జాలర్లు తమ వలలో పడిన అన్ని శంఖాలను ఒక ప్రాంతంలో పారబోయాలని నిర్ణయించారట.

అలా అయితేనే మళ్ళీ తమ వలలో శంఖాలు పడవని భావించారట.ఆ విధంగా ఒకే ప్రాంతంలో శంఖాలు వేయడంతో అది ఇప్పుడు ఒక దీవిగా మారిపోయింది.

"""/"/ ఈ శంఖాలలో అనేక రకాల సముద్ర జీవులు నివాసముంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

గతంలో ఇవి అస్తిపంజరాలు అని ప్రచారం జరిగింది.కానీ ఆ తర్వాత వీటిని తవ్వగా ఒక్క అస్తిపంజరం కూడా కనిపించలేదు.

దాంతో ఈ దీవిలో ఎలాంటి కుట్ర గాని రహస్యం గాని లేదని ప్రపంచానికి తెలియవచ్చింది.

ఈ దీవిని ఎక్కువగా అమెరికా ప్రజలు సందర్శిస్తుంటారు.ఇక్కడ చాలా దీవులు ఉంటాయి కాబట్టి సముద్రపు నీరు కూడా తక్కువగానే ఉంటుంది.

అందువల్ల ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం లేదు.స్థానికులే బోటు నడుపుతూ పర్యాటకులను ఈ ప్రాంతానికి తీసుకెళ్తుంటారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా సీఎం రేవంత్ ప్రచారం..!