ప్రమోషన్‌ మొదలు పెట్టారు థియేటర్లు ఏవీ?

ప్రమోషన్‌ మొదలు పెట్టారు థియేటర్లు ఏవీ?

మూడు నెలల తర్వాత మళ్లీ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలు అవ్వబోతుందని అంతా అనుకున్నారు.

ప్రమోషన్‌ మొదలు పెట్టారు థియేటర్లు ఏవీ?

ఇప్పటికే జులై 30వ తారీకున సినిమాలను విడుదల చేయబోతున్నట్లుగా ఇష్క్‌ మరియు తిమ్మరుసు చిత్రాల మేకర్స్ ప్రకటించారు.

ప్రమోషన్‌ మొదలు పెట్టారు థియేటర్లు ఏవీ?

కాని ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితిపై క్లారిటీ రావడం లేదు.

తెలంగాణలో థియేటర్లు పునః ప్రారంభించినా ఏపీలో మాత్రం థియేటర్లను ప్రారంభించేందుకు అవకాశం లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు లేనట్లుగా ఉన్నా కూడా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం పరిస్థితులు చక్కబడాలంటూ వెయిట్‌ చేస్తున్నారు.

సినిమా షూటింగ్‌లు ముగించి వెంటనే విడుదల చేయాలనుకున్న వారు ప్రమోషన్‌ ను మొదలు పెట్టారు.

తిమ్మరుసు మరియు ఇష్క సినిమాలకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టిన చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు.

కాని ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇష్క్‌ సినిమా విడుదల కోసం గతంలోనే ప్రమోషన్‌ లు చేశారు.కాని ఇప్పటి వరకు విడుదల చేయలేక పోయారు.

ప్రమోషన్‌ లు మొదలు పెట్టిన మేకర్స్‌ థియేటర్ల లో జులై 30వ తారీకున విడుదల చేసేందుకు మళ్లీ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

"""/"/ ఒక వేళ థర్డ్‌ వేవ్‌ అంటూ ఏమైనా మళ్లీ థియేటర్లను నిలిపి వేస్తారా అనేది చూడాలి.

ప్రమోషన్‌ లు చేస్తున్నా కూడా విడుదల వరకు నమ్మకం లేదు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆగస్టులో మాత్రం వరుసగా సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి థియేటర్లలో విడుదల ఖాయం కాని ప్రేక్షకులు వస్తారా అనేది అనుమానంగా ఉందంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్‌ చేస్తున్నారు.

పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన ప్రముఖ స్టార్ సింగర్.. డిలీట్ చేయడానికి కారణాలివేనా?

పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన ప్రముఖ స్టార్ సింగర్.. డిలీట్ చేయడానికి కారణాలివేనా?