‘అర్జున’ మరింత బాధ్యతను పెంచింది: ఇషాంత్ శర్మ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొరకు ఇషాంత్‌ శర్మ దుబాయ్‌ వెళ్ళాడు.కానీ కొన్ని కారణాల చేత శనివారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు హాజరు కాలేదు.

ఈ సందర్భంగా అతను సోషల్ మీడియా వేదికగా అవార్డులు గెలుపొందిన క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు.

తన శరీరం పూర్తిగా సహకరించినంత కాలం క్రికెట్‌ ఆడతానని, క్రికెట్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అర్జున అవార్డు విజేత, భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఈ సందర్భంగా అన్నాడు.

తన చిన్న తనం మెమరీస్ ను గుర్తుచేసుకుంటూ."చిన్నతనంలోనే క్రికెట్‌ నా ప్యాషన్ అని తెలుసుకున్నా నాటినుండి నేటిదాకా.

ప్రతీ మ్యాచ్ ‌లోనూ నేను 100 శాతం ఎఫర్ట్ పెట్టి ఆడాను.13 ఏళ్ల తర్వాత లభించిన ఈ అమూల్యమైన అర్జున అవార్డు నన్ను మరింత ముందుకు వెళ్లేందుకు కావాల్సిన బలాన్నిచ్చింది.

ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖకు నా ప్రత్యేక కృతజ్ఞతలు" అని తెలియజేసారు.

అలాగే నా ప్రతి మలుపులోనూ.వెన్నంటే నిలిచిన బీసీసీఐ కి చాలా ధన్యవాదాలు.

ఇకపోతే ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ నా ప్రత్యేక అభినందనలు.అని ఇషాంత్‌ తన ట్విట్టర్‌ లో పేర్కొన్నాడు.

ఇక 31 ఏళ్ల వయసుగల ఇషాంత్ శర్మ మొత్తం భారత్‌ తరఫున 80 వన్డేలు, 97 టెస్టులు, 14 టి20ల్లో టీమిండియా తరుపున కీలక పాత్ర పోషించాడు.

ఈ ఏడాది ఇషాంత్ తో పాటు మహిళా క్రికెటర్‌ 'దీప్తి శర్మ' అర్జునకు ఎంపిక కాగా.

రోహిత్‌ శర్మ కు ‘ఖేల్‌రత్న’కు ఎంపికవ్వడం గమనార్హం.

ఖడ్గం సినిమాకు నన్ను తీసుకోవద్దన్నారు..శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!