అర్జున అవార్డుకు ఎంపికైన ఇషాంత్‌ శర్మ…!

టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు అయిన అర్జున అవార్డు కు నామినేట్ అయ్యాడు.

ఈ అవార్డు కోసం ఇషాంత్ శర్మ తో పాటు హాకీ క్రీడాకారిణి దీపికా టాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, భారత టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరన్, ఆర్చర్ అతాను దాస్ ఇలా మొత్తం 29 మంది పేర్లను తాజాగా జరిగిన జాతీయ అవార్డు కమిటీ సమావేశంలో సెలెక్షన్ కమిటీ సిఫారసు చేసింది.

ఇకపోతే టీమిండియా తరపున ఇషాంత్ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలలో ఆడాడు.

అలాగే అనేక టి20 మ్యాచ్ ల్లో కూడా ఇషాంత్ శర్మ ఆడాడు.అన్ని ఫార్మాట్లకు కలిపి ఇప్పటివరకు నాలుగు వందల కోట్లకు పైగా నేలకూల్చాడు.

ఇక మరోవైపు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మకు క్రీడలలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కు ఎంపిక చేసిన సంగతి విదితమే.

"""/"/ వివిధ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చూపించిన వారికి ప్రతి సంవత్సరం భారతదేశ ప్రభుత్వం నుండి అత్యున్నత పురస్కారాలు అందచేయబడతాయి.

ఇకపోతే ప్రస్తుతం ఇషాంత్ శర్మ కేవలం టెస్ట్ మ్యాచ్ లలో మాత్రమే ఎక్కువగా కొనసాగుతున్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ లలో పెద్దగా సత్తా చూపక పోవడంతో అతనిని పరిమిత ఓవర్ల లిస్టులో కాస్త దూరంగా ఉంచుతున్నారు.

విజయ్ దేవరకొండ ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాడా..?