సమంతకు ఝలక్ ఇచ్చిన ఇషా రెబ్బా…అసలేమయిందంటే

తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు హీరోయిన్లలో ఒకరిగా నిలిచి, రాగల 24 గంటల్లో, అరవిందసమేత వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తన అందచందాలతో కుర్ర కారును మత్తెక్కించింది.

అయితే సినిమా విజయం సాధించినా పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేకపోయింది.అయితే కొంత మేర ఇప్పుడిప్పుడే అవకాశాలను సొంతం చేసుకుంటున్నా తన కొన్ని అనాలోచిత నిర్ణయాలతో మంచి మంచి ఛాన్స్ లను వదులుకుంది.

అయితే తాజాగా సమంతకు ఈషా రెబ్బా ఝలక్ ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.అయితే ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమా శాకుంతలం.

అయితే ఈ సినిమాలో సమంతతో పాటు కీలక పాత్రలో నటించడానికి ఇషా రెబ్బాను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలోని తన పాత్ర పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఇషా రెబ్బా, అంతేకాక పారితోషికం పట్ల సంతృప్తి చెందని ఇషా రెబ్బా సమంత సినిమాలో పాత్రను రిజెక్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

అయితే సమంత సినిమాలో ఛాన్స్ ను వదులుకుందంటే పాత్రల కన్నా పారితోషికానికి విలువనిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే సినిమా రిజెక్ట్ చేసినందుకు అంతర్మధనం చెందుతుందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే సమంత సినిమాలో చేసి ఉంటే మరిన్ని అవకాశాలు దరచేరేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పురుషులు తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ను పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు!