రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా టీడీపీ, జనసేన, వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్ష పార్టీలూ వ్యతిరేకిస్తుండగా వైసీపీ మాత్రం పొగుడుతుండడం గమనార్హం.
కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలు ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి మొదలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టుకు కూడా వెళ్లాయి.
అప్పట్లో అవినీతి, అక్రమాల కారణంగా మా వాళ్లు నామినేషన్ వేయలేక పోయారు కనుక మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ పార్టీలు కోరుతున్నాయి.
ఈ క్రమంలో 16 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన ఈ 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
అయితే ఇక్కడే చిత్రమైన రాజకీయం వెలుగు చూసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల వైఖరిపై నెటిజన్లు మండి పడుతున్నారు.
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఆయనను తిట్టిన వైసీపీ ఇప్పుడు మాత్రం కొనియాడుతోంది.
నిమ్మగడ్డను ఇప్పుడు వైసీపీ నాయకులు సపోర్టు చేస్తున్నారు.ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.