వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏంటీ మార్పు.. అలా చేస్తుంది ఎవరు?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ తిరుగుతున్నారు.

అయితే ఈ కార్యక్రమం ద్వారా లాభం సంగతి దేవుడెరుగు.నష్టమే కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు.

ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను వివిధ ప్రశ్నలతో నిలదీస్తున్నారు.దీంతో చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

మొత్తానికి ఈ కార్యక్రమం కొందరు వైసీపీల్లో మార్సు తెచ్చిందని ప్రచారం జరుగుతోంది.ఉదాహరణకు తీసుకుంటే సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిలో మార్పు కనిపిస్తోంది.

కొన్నిరోజుల కిందటి వరకు పచ్చ మీడియా అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై ఆరోపణలు చేసిన ఆయన.

తాజాగా ఈనాడు దినపత్రికపై ప్రశంసలు కురిపించారు.ఈనాడు పత్రిక విలువలతో వార్తలు రాసే పత్రిక అంటూ ప్రశంసించారు.

ఆంధ్రజ్యోతి టీడీపీకి కరపత్రిక అయితే సాక్షి వైసీపీకి భజన చేస్తుందని కూడా కుండబద్ధలు కొట్టారు.

"""/"/ అయినా తన నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే తాను మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లనే చదువుతానని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి స్పష్టం చేశారు.

దీంతో తాగినోడు నిజాలే మాట్లాడినట్లు.దెబ్బతిన్నోళ్లు కూడా నిజాలే మాట్లాడతారని అందరూ చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ఏపీలో సీన్ అర్ధం చేసుకున్నారు కాబట్టే వైసీపీ ఎమ్మెల్యేలలో మార్పు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"""/"/ రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నిజాలే చెప్పారని భావించినా.వైసీపీ అధినేత జగన్ సొంత పత్రిక సాక్షి దినపత్రికను భజన పత్రికగా అభివర్ణించడం మాత్రం కొందరు వైసీపీ అభిమానులకు రుచించడం లేదు.

అటు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా వైసీపీ నేతలకు హితబోధ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

చేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోవద్దంటూ వైసీపీ క్యాడర్‌కు హితబోధ చేశారు.

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరని.ప్రతిపక్ష నేతలను శత్రువులుగా చూడొద్దని ఆయన సూచించారు.

ఈ విధంగా వైసీపీలో నిజాలు చెప్పే వారి జాబితా పెరుగుతోంది.మరి వీళ్ల వ్యాఖ్యలపై వైసీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఏపీలో వైసీపీ ప్రభంజనం ఖాయం.. తేల్చేసిన టీడీపీ