పవన్ ఫ్యాక్టర్ని ఒప్పుకున్నట్టేనా?
TeluguStop.com
2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయి సరైన ప్రభావం చూపించలేకపోయినప్పటికీ 2024 ఎన్నికలకి జనసేన ( JanaSena Party )పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుందని క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అంచనాలు ఉన్నాయి .
అయితే అధికారి వైసిపి ( YCP Party )మాత్రం ఇప్పటివరకు ఆ విషయం ఒప్పుకోదు జనసేన ప్రభావం ఏమీ లేదని తెలుగుదేశంతో కలిసి వచ్చినా కూడా తమ మెజారిటీని తగ్గించలేరని, మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చిన జనం మాకు 175 కి 175 సీట్లు ఇస్తారంటూ అంటూ తన దోరణి లో ప్రకటనలు ఇస్తున్నార్తు .
"""/" /
అయితే నిన్న మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల ద్వారా పవన్ ఫ్యాక్టరీ ఉందని అదికార పార్టీ బావిస్తుంది అని ఒప్పుకున్నట్లయ్యింది .
చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి కొడాలి నని తెలుగుదేశం అదినేత చంద్రబాబుపై ఒక రేంజ్ లో విమర్శలు చేశారు .
అసలు చంద్రబాబు నాయుడు వల్లే ఏపీకి పరిస్థితి వచ్చిందని తన హయాంలో ఒక్క ప్రాజెక్టు ఉన్న కూడా పూర్తి చేయలేక పోయినప్పటికీ మరొకసారి అవకాశం ఇస్తే పూర్తి చేస్తానంటున్న ఈయన మాటలు ఎవరు నమ్మరని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈయనకు మరొక అవకాశం ఇవ్వకూడదు అంటూ కొడాలి నాని చెప్పుకొచ్చారు.
"""/" /
పనిలో పనిగా జనసేన ని కూడా విమర్శించిన నాని తన పార్టీ బలోపేతం కోసం మూడు కాదు 36యాత్రలు చేసుకోవచ్చని వైసిపి ని ఎన్ని విమర్శలు చేసినా పరవాలేదని కానీ రాష్ట్రాన్ని నాశనం చేసిన బాబుతో చేతులు కలపొద్దని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు.
చంద్రబాబుతో కలిసి వచ్చినా సమర్థించినా పవన్ ని కూడా రోడ్డుపై బట్టలిప్పీ నిలబడతామంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే ఆయన తనకు తెలియకుండానే తన విమర్శల జనసేన- టిడిపి( TDP Party ) పొత్తు విన్నింగ్ కాంబినేషన్ అని ఒప్పుకున్నట్లయ్యింది అని పరిశీలకులు వాఖ్యనిస్తున్నారు .
రెండు పార్టీలు విడిగా ఉన్నతసేపు కచ్చితంగా తమకు విజయానికి అవకాశం ఉంటుందని, ఆ రెండు కలిసి వస్తే మాత్రం కష్టమేనని వైసిపి కూడా భావిస్తుందని మాజీ మంత్రిగారి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది.
అయినా ఒక రాజకీయ పార్టీ అధినేతగా రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కును బట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటారు తప్ప వైసీపీ చెప్పినట్లు జనసేన వింటుందా అంటూ కూడా ఈయన వ్యాఖ్యలపై సెటైర్లు పడుతున్నాయి
.
స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయం.. ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్!