భర్త హత్యకు భార్య అక్రమ సంబంధమే కారణమా…?

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఏఆర్ నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం సంచలనం కలిగించింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఏఆర్ నగర్ కాలనీకి చెందిన ఓర్సు వెంకన్న,మైసమ్మ దంపతుల మధ్య గత కొంత కాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి.

దానికి కారణం వెంకన్న భార్య మైసమ్మ కొంత కాలంగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భర్తకు అనుమానం రావడమేనని తెలుస్తుంది.

అక్రమ సంబంధం విషయం భర్త వెంకన్నకి తెలిసిన దగ్గర నుండి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి భర్తను చంపినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు పరిస్థితి పరిశీలించి,కేసు నమోదు చేసి,భార్యను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE