షుగర్ వ్యాధి ఉన్నవారు పుచ్చకాయ తినొచ్చా..?
TeluguStop.com
ఇటీవల రోజుల్లో షుగర్ వ్యాధి లేదా మధుమేహం( Diabetes ) బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.
ఇంటికి కనీసం ఒక్కరైనా షుగర్ పేషంట్ ఉంటున్నారు.షుగర్ వ్యాధి ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.
రక్తంలో చక్కెర స్థాయిలను( Blood Sugar Levels ) పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి.
అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు తినదగిన ఆహారాలను కూడా దూరం పెడుతుంటారు.
అటువంటి వాటిల్లో పుచ్చకాయ( Watermelon ) ఒకటి.అసలు షుగర్ వ్యాధి ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా? అంటే.
సురక్షితంగా తినొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.కానీ సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవాలి.
"""/" /
పుచ్చకాయలో నీరు మరియు ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది.అలాగే ఇది కొంచెం ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది.
100 గ్రాముల పుచ్చకాయలో జిఐ 72 ఉంటుంది.కానీ పుచ్చకాయలో గ్లైసెమిక్ లోడ్ చాలా తక్కువ.
100 గ్రాములకు 2 మాత్రమే.సో.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయం లేకుండా ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను లాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు మాత్రం పుచ్చకాయ తీసుకోవడం చెత్త ఎంపిక అవుతుంది.
"""/" /
ఇక పుచ్చకాయ ఆరోగ్య లాభాల విషయానికి వస్తే.పుచ్చకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
కడుపు సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో పుచ్చకాయను చేర్చుకుంటే మంచిది.పుచ్చకాయలో ఉండే అమైనో యాసిడ్ సిట్రులిన్ కండరాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడుతుంది.
తీవ్రమైన వ్యాయామం తర్వాత పుచ్చకాయ ముక్కలు తింటే వేగంగా కండరాల రికవరీ అవుతాయి.
అంతేకాకుండా పుచ్చకాయ అధిక రక్తపోటును తగ్గిస్తుంది.పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండటం వల్ల.
ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.శరీరంలో హానికరమైన పదార్థాలను బయటకు పంపుతుంది.
పుచ్చకాయలోని పొటాషియం ఇది శక్తిని అందించడానికి మరియు ఆరోగ్యకరమైన హృదయాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
సంక్రాంతికి కచ్చితంగా అరిసెలు ఎందుకు తినాలి..?