వివేక్ ఆత్రేయ నెక్స్ట్ సినిమాను ఆ స్టార్ డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ల సత్తా చాటుకోవడానికి వైవిధ్యమైన కథంశాలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వివేక్ ఆత్రేయ( Vivek Atreya ) లాంటి దర్శకుడు కూడా నానితో చేసిన సరిపోదా శనివారం సినిమాతో( Saripodhaa Sanivaaram ) ఒక మంచి సక్సెస్ ను అయితే అందుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడనే చెప్పాలి.ప్రస్తుతం ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇక మొత్తానికైతే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక మార్కును కూడా క్రియేట్ చేసుకున్నాడు.
"""/" /
ఇక ఇప్పటికే నానితో ( Nani )రెండు సినిమాలను చేసిన వివేక్ ఆత్రేయ ఒక సినిమాతో ప్లాప్ ను ఇచ్చినప్పటికీ, మరొక సినిమాతో మాత్రం సూపర్ సక్సెస్ ని అందించాడు.
ఇక ఇప్పుడు ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు గా తెలుస్తుంది.
మరి అందులో భాగంగానే ఆయనతో సినిమాలు చేసే స్టార్ హీరో ఎవరు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇప్పుడు ఆయన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే స్థాయిని దాటిపోయినట్టుగా తెలుస్తోంది.
ఇక నెక్స్ట్ రవితేజ( Ravi Teja ) తో ఒక సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
వైవిద్యమైన కథాంశాలతో సినిమాలు చేసే వివేక్ ఆత్రేయ రవితేజతో రొటీన్ కమర్షియల్ సినిమా చేస్తాడా? లేదంటే ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేస్తాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ఆయన ఎంచుకున్న బాటలో మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.
ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి రవితేజ కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మహేష్ నా చిన్న తమ్ముడు… పవన్ అందుకే మా ఇంటికి వచ్చేవాడు: వెంకటేష్