విశాఖ సాగరతీరం కాలుష్య కోరల్లో చిక్కుకుందా..?
TeluguStop.com
విశాఖ సాగరతీరం కాలుష్య కారకంగా మారుతోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా బీచ్ ప్రాంతమంతా నల్లగా మారడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు పర్యావరణ వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గడచిన వారం రోజులుగా ఇదే పరిస్ధితి ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీనికి స్పష్టమైన కారమం తెలియనప్పటికీ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యమే కారణమని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.
గతంలో ఇదే విధంగా వచ్చినా నగరం నుంచి వస్తున్న మురుగు నీరు కారణంగా ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు.
బీచ్ ప్రాంతమంతా నల్లగా మారడానికి అసలు కారణాలపై పర్యావరణ వేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.
సంపత్ నంది ఏది చేసిన డిజాస్టర్ అవ్వాల్సిందేనా..?