వెంకటేష్ తమిళ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా..?
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu Film Industry ) ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్లందరికీ చాలా మంచి గుర్తింపైతే ఉంది.
మరి వాళ్లలో వెంకటేష్ ( Venkatesh ) లాంటి హీరోకి చాలా అరుదైన ఇమేజ్ అయితే దక్కుతుంది.
ఆయన లాంటి హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి ఆయన చేసిన సినిమాలను చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ఇమేజ్ ను క్రియేట్ చేసి పెట్టారు.
కాబట్టే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రతి ప్రేక్షకుడు ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు.
అలాంటి సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి అయితే ఉంది.
మరి ఆయన రీసెంట్ గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
తమిళంలో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న విగ్నేష్ శివన్( Vignesh Sivan ) డైరెక్షన్ లో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వస్తున్నాయి.
"""/" /
నిజానికి వీళ్ళ కాంబినేషన్ ను సెట్ చేసింది కూడా నయనతారనే కావడం విశేషం.
ఇక ఈ వార్త అయితే నెట్టింట విపరీతంగా సర్కిల్ అవుతుంది.ఇక నయనతార వెంకటేష్ మెయిన్ లీడ్ గా విఘ్నేష్ శివన్ ఒక సినిమా చేయబోతున్నారట.
ఇది చాలా రియలిస్టిక్ సినిమా గా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు.
తద్వారా ఆయన ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు అనేది.