పెళ్లి వద్దని విదేశాల్లో మాస్టర్స్‌ డిగ్రీ.. ఈ మహిళ రియల్ రోల్ మోడల్..?

సాధారణంగా ఆడపిల్లలకు 22 ఏళ్ల వయసు దాటితే తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటారు పాతిక ఏళ్ల వయసొచ్చిందంటే చాలు చాలా భయపడి పోతారు.

ఎంత కష్టమైనా ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు.కానీ ఆడవాళ్ళకి పెళ్లి అల్టిమేట్ డెస్టినేషన్ కాదు వారు కూడా మగవాళ్ళ లాగా జీవితంలో ఏదో ఒకటి సాధించేదాకా సమయం ఇవ్వాలి పెళ్లి చేసి పంపించు కూడదు అని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు అయితే ఇలాంటి వారికి కొంతమంది ఇన్‌స్పిరేషనల్ గా నిలుస్తున్నారు.

అలాంటి వారిలో తాజాగా చేరిపోయింది ఐశ్వర్య తౌకరీ.ఈ భారతీయ మహిళ ఇటీవల తన కథను లింక్డ్‌ఇన్‌లో పంచుకుంది, అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.

ఆమె తన కుటుంబంలో నలుగురు పిల్లలలో చిన్నది, ఆమె కుటుంబంలో మాస్టర్ డిగ్రీ పొందిన మొదటి వ్యక్తి.

చదువుకోవడానికి, పని చేయడానికి ఆమె తన చిన్న గ్రామాన్ని వదిలి విదేశాలకు వెళ్ళింది.

మరొక దేశానికి వెళ్లి మాస్టర్స్ చేసింది.ఆమె మార్గం సులభం కాదు.

ఒక అమ్మాయిగా, ఆమె అబ్బాయిలతో క్రికెట్ ఆడింది.చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది.

బదులుగా ఆమె చదువుకోవాలని, వర్క్ చేయాలని కోరుకుంది.19 ఏళ్ల వయస్సులో, ఆమె ఇంటి నుండి చాలా దూరంలో ఇంటర్న్‌షిప్‌లు ప్రారంభించింది.

21 ఏళ్ల వయస్సులో, ఆమె పెద్ద నగరాల్లో నివసిస్తూ, పని చేస్తూ ఉంది.

కొంతమంది ఐశ్వర్య ( Aishwarya )అనుకున్నది చేయలేదని చాలామంది డిసప్పాయింటింగ్ వర్డ్స్ చెప్పారు, కానీ ఆమె కమ్యూనికేషన్ స్టడీస్‌లో చాలా మంచి కాలేజీలో చేరింది.

"""/" / ఐశ్వర్య తౌకరీ( Aishwarya Taukari ) ఒక ప్రముఖ పబ్లిక్ రిలేషన్స్ సంస్థలో పనిచేసి బాగా రాణించింది.

ఆ తర్వాత, ఆమె రెండున్నర సంవత్సరాలు బ్రేక్ తీసుకుంది.ఆ సమయంలో స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొని తన స్వేచ్ఛను ఆస్వాదించింది.

తర్వాత, మరొక దేశంలో పెద్ద చదువులు చదువుకోవాలని నిర్ణయించుకుంది.దాని కోసం ఆమె రెండు ఉద్యోగాలు చేసింది.

కొంతమంది ఆమె గత అనుభవం కొత్త దేశంలో పనికిరాదని చెప్పారు, కానీ ఆమె వారి మాటలను పట్టించుకోలేదు.

ఆమె కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్తగా ప్రారంభించడానికి ధైర్యం చేసి ముందుకు అడుగులు వేసింది.

"""/" / ఏదైనా మొదట పెట్టేటప్పుడు కష్టంగా అనిపిస్తుందని, స్టార్టింగ్ లోనే పర్ఫెక్షన్ సాధించాలనుకోవడం తప్పు, మొదటిసారిలోనే అన్నీ సరిగ్గా చేయడం ఎవరికి సాధ్యం కాదు అని చెప్పింది.

రోజూ చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రోగ్రెస్ సాధించాలని సూచించింది.ఈ అడుగులు చిన్నవే అయినా, అవి చాలా ముఖ్యమైనవని తెలిపింది.

ఐశ్వర్య పోస్టు చాలామందిలో స్ఫూర్తిని నింపింది.ఎంత కష్టమైనా ఒక గోల్ పెట్టుకుని దానిని సాధించేంతవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అని ఆమె చెప్పిన మాటలు చాలామందికి ఇన్‌స్పిరేషనల్ గా నిలుస్తున్నాయి.

ఇలాంటి మంచి స్ఫూర్తిదాయకమైన జర్నీ షేర్ చేసుకున్నందుకు ఆమెకు చాలామంది ధన్యవాదాలు చెప్పారు.

ఈ మహిళ ఓ రియల్ రోల్ మోడల్ అని పేర్కొంటున్నారు.

ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?