వైరల్: ముష్టి యుద్ధం అంటే ఇదేనేమో... కారు గుద్దుకొని గాల్లోకి ఎగిరిపడ్డా బుద్ధిరాలేదు వీళ్ళకి?

సోషల్ మీడియా మితిమీరి విస్తరించడంతో ప్రతి చెత్త వైరల్ గా మారుతోంది.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని బాధని కలిగిస్తాయి.

ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని చిరాగ్గా ఉంటాయి.తాజాగా ఈ కోవకి చెందినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూస్తే నేటి యువత బలుపు చాలా క్లియర్ గా కనబడుతుంది.

అక్కడ నడి రోడ‍్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.

ఇద్దరిని బలంగా ఢీకొట్టింది.దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు.

దాంతో గొడవ సద్దుమణిగింది అనుకుంటే పొరపాటే.అంత వేగంగా కారు ఢీకొట్టినా.

అక్కడ గొడవ ఆగలేదు.అక్కడ ఏం జరగలేదు అన్నట్టు వ్యవహరించారు ఆ విద్యార్థులు.

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.కాగా కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లాలో జరిగింది.కన్న తల్లిదండ్రులు చదువుకొమ్మని పంపిస్తే, ఒళ్ళు తెలియకుండా వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే నిజంగా చిరాకు కలుగుతుంది.

"""/"/ వివరాల్లోకి వెళితే, ఏదోఒక విషయంలో కళాశాల విద్యార్థులు రోడ్డుపై గొడపడుతున్నారు.అప్పుడే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది.

దానిని చూసి అంతా పక్కకు పరిగెట్టారు.కాని ఓ ఇద్దరు మాత్రం గమనించకపవటంతో వారిని కారు ఢీకొట్టింది.

ఓ వ్యక్తి అయితే అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డాడు.ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది.

అయితే, కొద్ద సేపటికి.పోలీసులు ఎంట‍్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు.

పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు.కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు.

ప్రధాని మోడీకి పెళ్లి ఆహ్వానం అందించిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఫోటో వైరల్!