త్వరలో కేసీఆర్ తీసుకోబోయే సంచలన నిర్ణయం ఇదే?

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలలో దిట్ట అనే విషయం రాజకీయాల గురించి కొద్దో, గొప్పో అవగాహన ఉన్న వ్యక్తికి కేసీఆర్ రాజకీయ చతురత ఏంటో తెలుసు.

అలాంటి కేసీఆర్ కు రెండు సార్లు పట్టం కట్టిన ప్రజలు మూడవసారి అధికారం ఇవ్వడానికి ఎలా ఆలోచిస్తారో కేసీఆర్ కు తెలియనిది కూడా కాదు.

అందుకే ప్రతిపక్షాలు ఇంత మాటల దాడితో రాద్ధాంతం చేస్తున్నా సరే, మౌనంగా తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నాడు.

అయితే కేసీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తోంది.

ఇప్పటికప్పుడు కాకపోయినా సరైన సమయంలో తీసుకొనే ఆ నిర్ణయంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు ఇరుకున పడుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శల పాలయ్యేది ఒక్క ఉద్యోగాల విషయంలోనే.ఐతే ఈ విషయంపై వ్యతిరేకతను పోగొట్టుకునేలా ఒక పకడ్బందీ వ్యూహానికి తెరలేపినట్టు సమాచారం.

ఐతే ఇప్పటికే యువతలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ఆరా తీసిన కేసీఆర్ త్వరలో నిరుద్యోగ సమస్యకు పులి స్టాప్ పెట్టేలా ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా కేసీఆర్ తీసుకునే ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో బయటికి రాకున్నా యువతకు శుభ వార్త తెలిపే అవకాశం ఉంది.

చూద్దాం ఈ నిర్ణయంతోనైనా నిరుద్యోగులు సంతృప్తి చెందుతారని ఆశిద్దాం.

కెనడాలో భారతీయ యువకుడి దారుణహత్య.. పోలీసుల అదుపులో అనుమానితుడు