హీరోయిన్ స్నేహ సినిమాల కంటే యాడ్స్ ఎక్కువ చెయ్యడం వెనుక అసలు కథ ఇది?

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కేవలం సినిమాలలోనే కాకుండా ప్రకటనల్లో కూడా నటిస్తుంటారు.కొన్ని ప్రోడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపడుతూ వాటిని ప్రకటిస్తుంటారు.

అలా ఎక్కువగా స్టార్ నటీనటులు మాత్రమే యాడ్స్ లలో నటిస్తారు.నిజానికి తక్కువ సమయంలో ఉండే ఈ యాడ్ కు నటీనటులు బాగా ఆసక్తి చూపుతుంటారు.

కేవలం చిన్న యాడ్ అయినా సరే పారితోషకం బాగా ఉంటుందని నటిస్తుంటారు.ఇదిలా ఉంటే హీరోయిన్ స్నేహ కూడా సినిమాల కంటే యాడ్స్ లలో నటించడం వెనుక ఓ కథ ఉందని తెలిసింది.

ఇంతకూ ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఒకప్పటి తెలుగు సినీ నటి, అందాల ముద్దుగుమ్మ స్నేహ గురించి అందరికీ తెలిసిందే.

తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హోదా ను సొంతం చేసుకుంది.

ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తుంది. """/"/ స్నేహ తొలిసారిగా తొలివలపు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎక్కువగా క్లాస్ సినిమాలలో మాత్రమే నటించింది.

ఫ్యామిలీ, లవ్ వంటి కథలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమెకు ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి పలు సినిమాలు మంచి గుర్తింపును అందించాయి.

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకొని అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక ఈమె మరో సినీ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లికి ముందు, తర్వాత కూడా కలిసి నటించారు.ఇద్దరు బుల్లితెరపై పలు యాడ్ లలో కూడా కలిసి నటించారు.

"""/"/ ఇదిలా ఉంటే స్నేహ సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ లలో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తుంది.

ఇక తను యాడ్స్ లో ఎక్కువగా నటించడానికి ఓ కారణం ఉందట.ఇక ఈ విషయం గురించి గతంలో అడిగితే తానే స్వయంగా తెలిపింది.

తనకు యాడ్స్ లలో నటించడం చాలా హ్యాపీగా ఉంటుందని పైగా యాడ్స్ ఎప్పుడు క్రియేటివ్ గా ఉంటాయని తెలిపింది.

అంతేకాకుండా యాడ్ అనేది వన్ మినిట్ లో అయిపోతుంది కాబట్టి ఆ ఒక్క నిమిషం లోనే ఎంతో చెప్పాలని యాడ్ ఫిలిం మేకర్స్ ఎంతో ట్రై చేస్తుంటారు అని తెలిపింది.

అందుకే ప్రతి ఒక యాడ్ కొత్తగా ఉంటుందని, కొత్త కొత్త చీరలు, నగలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుందని అందుకే ప్రకటనలలో నటించడానికి అంత ఆసక్తి చూపుతానని తెలిపింది.

"""/"/ అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో కూడా కనిపిస్తుంది స్నేహ.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్28, గురువారం 2024