జలవివాదంపై కేసీఆర్ వెనక్కి తగ్గక పోవడానికి అసలు కారణం ఇదే?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పెద్ద ఎత్తున జరుగుతున్న  విషయం తెలిసిందే.

ఇక ఇది చిలికి చిలికి గాలి వానలా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇటు ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇరు రాష్ట్రాల పోలీసులు బ్యారేజీ వద్ద మొహరించడంతో బ్యారేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవిషయం తెలిసిందే.

అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని పరిష్కరించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం చాలా వరకు ఉంది.

కాని ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది రాజకీయ పరమైన యుద్దం అనేది ఎవ్వరికీ తెలియరాని అంశం.

  అయితే షర్మిలను తెలంగాణలో పార్టీ ఏర్పాటు  విషయంలో జగన్ కు కెసీఆర్ పలు సూచనలు చేసినప్పటికీ , షర్మిలను నిలువరించడంలో జగన్ విఫలమవడంతో కెసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ జైలులో ఉన్న సమయంలో వైయస్సార్ పార్టీకి అండగా ఉండి పాదయాత్ర చేసి పార్టీని ప్రజల్లో ఉండేలా కాపాడిన షర్మిలకు పార్టీ అధికారంలోకి వచ్చాక షర్మిలను పక్కన బెట్టడంతో షర్మిల ఇటు తెలంగాణ రాజకీయాలలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

"""/"/ అయితే షర్మిలను సాధ్యమైనంత మేర అడుకోగలిగితేనే నీటి సమస్య జగడాలు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సీఎం జగన్ రేపటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!