బండి సంజయ్ కు ఉన్న ప్రధాన బలం ఇదే?

కార్పొరేటర్ స్థాయి నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బండి సంజయ్ అంచలంచెలుగా ఎదుగుతూ బీజేపీ అధ్యక్షుని స్థాయికి ఎదిగిన పరిస్థితి ఉంది.

కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినా, బీజేపీ అధిష్టానం సూచనతో ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిపించాడు.

రాజకీయంగా ఎంతో దూకుడుగా ఉండే బండి సంజయ్ వ్యక్తిగతంగా కార్యకర్తల వద్ద మంచి పేరుంది.

ప్రతి ఒక్క కార్యకర్తతో భుజంపై చేయి వేసి మాట్లాడుతూ తనకున్న బాధను, సమస్యను స్వయంగా తెలుసుకుంటాడు.

వ్యక్తిగత జీవితంలో సాధారణంగా ఉండే బండి సంజయ్ కార్యకర్తలే బండి సంజయ్ కు ప్రధాన బలం.

ఏమీ ఆశించకుండా బండి సంజయ్ గెలుపే లక్ష్యంగా పనిచేసే నిబద్దత గల కార్యకర్తలు ఉన్నారు.

అందుకే బండి సంజయ్ గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా బండి సంజయ్ వెంట ఉండి ప్రధాన బలంగా నిలుస్తారు.

తద్వారా ఎన్నికలు ఉన్నా లేకపోయినా బండి సంజయ్ చేసిన ప్రతి పని కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది.

తద్వారా ప్రజలతో ఎప్పుడు మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు.ప్రస్తుతం ఆ బలంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీని పరుగులు పెట్టిస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం.

రానా లీడర్ 2 లో అనుకోని ట్విస్ట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల…