Oriana Lindsay : మాజీ భర్తను మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ.. చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైమ్?
TeluguStop.com
అమెరికాకు చెందిన ఓరియానా లిండ్సే( Oriana Lindsay ) అనే ఓ మహిళ గతంలో తన భర్తకు విడాకులు ఇచ్చింది.
మళ్లీ అదే భర్తను ఆమె పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.సాధారణంగా ఒకసారి ఒక భర్త నుంచి విడిపోతే మళ్లీ ఎవరూ కలుసుకోవడానికి ఇష్టపడరు.
విడిపోయే ముందే జీవితంలో మళ్ళీ కలిసి ఉండలేం అనే నిర్ణయానికి వచ్చి వారు విడాకులు తీసుకుంటారు.
కానీ ఓరియానా ఫస్ట్ ఎవరైతే వద్దనుకుందో మళ్లీ అతడినే పెళ్లి చేసుకుంది.అంతేకాదు ఆ భర్త వేరొక మహిళతో కన్న కుమార్తెను కూడా ఈమె సంతోషంగా తన అక్కున చేర్చుకుంది.
రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఒరియానా రీసెంట్‌గా మాజీ భర్తను తిరిగి వివాహం చేసుకుని బంధుమిత్రులందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.
ఒరియానా టిక్‌టాక్‌లో 21,000 మందికి పైగా ఫాలోవర్లతో పాపులర్ అయింది.నలుగురు పిల్లల తల్లిగా తన అనుభవాలను పంచుకోవడానికి ఆమె తన ఖాతాను ఉపయోగిస్తుంది.
ఆమె తన "బెస్ట్ ఫ్రెండ్" అని పిలిచే తన మాజీ భర్తతో ఇటీవల జరిగిన నిశ్చితార్థం చేసుకొని ఆ విషయాన్ని వెల్లడించింది.
ప్రేమపై నమ్మకం ఉంచండి అంటూ ఇతరులను ప్రోత్సహించింది.తనకు 19 ఏళ్ల వయసులో పెళ్లయ్యాక ఇద్దరు పిల్లలు కన్నానని కూడా చెప్పుకొచ్చింది.
"""/" /
తమ జీవిత ప్రయాణం చాలా అనూహ్యంగా సాగిందని ఒరియానా మాట్లాడింది.
విడాకులు( Divorce ) తీసుకోమని ఏడేళ్ల క్రితమే ఎవరైనా చెబితే తన గుండె పగిలిపోయి ఉండేదని కానీ ఆ తర్వాత ఆ నిర్ణయం తానే తీసుకున్నానని చెప్పింది.
ఈమె వాఫిల్ హౌస్‌లో మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదా ఓ చిన్న అమ్మాయికి సవతి తల్లి కావడం గురించి కలలో కూడా ఊహించలేదట.
వారి వివాహ వేడుకకు ఒక నెల ముందు గర్భవతి అనే ఆలోచన ఆమెకు అసాధ్యం అనిపించింది.
వారి కలల వివాహాన్ని కూడా కూడా నమ్మలేకపోయింది. """/" /
తన సోషల్ మీడియా పోస్ట్‌లో, ఒరియానా కుటుంబ ఫోటోను షేర్ చేసి తమ ప్రేమ కథను ఎవరూ ఆపలేనిది అని విశ్వాసం వ్యక్తం చేసింది.
తాను, తన భర్త మళ్లీ ఒక్కటయ్యేందుకు రెండేళ్లు పట్టిందని, వైవాహిక బంధం లో చాలా ఓపికగా ఉండాలని ఆమె మరో వీడియోలో వెల్లడించింది.
అయితే కొందరు ఆమె నిర్ణయాన్ని నేర్చుకున్నారు మరికొందరు మళ్లీ విడాకులు తీసుకొని విడిపోకండి అని సలహా ఇచ్చారు.
అయితే విడాకులు ఇచ్చిన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న ఘటన జరగడం చరిత్రలో ఇదే తెలుసారేమో అని మరికొందరు సరదాగా కామెంట్లు పెట్టారు.
ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కులు.. కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ కీలక ప్రతిపాదనలు