సూర్య కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వచ్చే సినిమా ఇదేనా..?
TeluguStop.com
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య( Suriya).
అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా వైవిధ్య భరితమైన కథాంశాలతో తెరకెక్కడమే కాకుండా ఇండస్ట్రీలో ఈయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు.
కాబట్టి ఈయన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం శక్తి లేదు.
ఇక ఇదిలా ఉంటే తమిళం లో జిగిరితండ లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.
ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎప్పటినుంచో సినిమా వస్తుంది అంటూ చాలా వార్తలైతే వచ్చాయి.
ఇక ఎట్టకేలకు వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. """/" /
ఇక వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది.
అలాగే కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraju) కూడా ఈ మధ్య వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
"""/" /
ఇక ఈ మధ్య ఈయన చేసిన సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే మాత్రం ఇప్పటికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
మరి ఆ అంచనాలకు తగట్టుగానే సూర్య తో చేయబోయే సినిమాని కూడా సక్సెస్ ఫుల్ సినిమాగా మార్చాలని తను కోరుకుంటున్నట్టు గా తెలుస్తుంది.
చూడాలి మరి వీళ్ళ కాంబో లో వచ్చే సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది.
ఇక వీళ్ళ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుంది.
వికలాంగుల కోటాలో జాబ్.. డ్యాన్సుల్లో మాత్రం అదరగొడుతోంది.. సెన్సేషనల్ వీడియో లీక్డ్!