పవన్ అసలు వ్యూహం ఇదా ? ‘ కాపు ‘ కాస్తారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని ఓడించడమే ధ్యేయంగా పవన్ ప్రస్తుతం వారహి యాత్ర చేస్తున్నారు.

ఈ యాత్రలో వైసిపి( YCP ) ప్రభుత్వం పైన , జగన్ పైన అనే విమర్శలు చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

అలాగే వైసిపికి మద్దతు ఇస్తున్న కొంతమంది కీలక వ్యక్తుల వ్యవహార శైలిని తప్పుపడుతూ పవన్ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.

ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లను పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.

టిడిపి( TDP ) తో పొత్తుతో జనసేన ముందుకు వెళ్లినా, ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా, కాపు సామాజిక వర్గం మొత్తం తన వైపే ఉండే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.

దీనిలో భాగంగానే ఆ సామాజిక వర్గంలో ఐక్యత తీసుకువచ్చే విధంగా పవన్ ప్రసంగాలు కనిపించాయి.

యాత్ర పవన్ అనుకున్న మేర సక్సెస్ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. """/" / టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )చేపట్టిన యువ గళం పాదయాత్రతో పోల్చుకుంటే , పవన్ వారాహి యాత్రకు స్పందన ఎక్కువగా వస్తోంది.

దాదాపు 12 రోజుల పాటు రాజమండ్రి,  కాకినాడ , డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర చేపట్టారు.

అనేక బహిరంగ సభలలోను పాల్గొన్నారు.ఈ సందర్భంగా చేనేత , మత్స్యకార వర్గాలతో పాటు,  ముస్లింలతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

అయితే అసలు లక్ష్యం మాత్రం కాపుల్లో ఐక్యత తీసుకువచ్చి,  వారి మద్దతు పూర్తిగా జనసేనకు( Janasena ) ఉండే విధంగా పవన్ ప్రసంగాలు కనిపించాయి.

అయితే పవన్ తన యాత్రలో ఎక్కడా టిడిపితో కలిసి పోటీ చేస్తారా ఒంటరిగా వెళ్తారా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్నికల సమయంలోనే దానిపై స్పందిస్తానని చెప్పారు.కేవలం వైసీపీని మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.

"""/" / జనసేన వర్గాల లెక్కల ప్రకారం కాపు సామాజిక వర్గంలో ఐక్యత వచ్చినట్టుగానే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంనూ పవన్ టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు .

దీనికి ముద్రగడ( Mudragada ) సైతం స్పందించి పవన్ కు లేఖలు రాశారు, విమర్శలు చేశారు .

ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరే అవకాశం ఉండడం,  వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయడంతో పాటు, కాపు సామాజిక వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉండడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న పవన్, కాపుల్లో ఐక్యత తీసుకొచ్చి , పూర్తిగా కాపుల మద్దతు జగన్ కు లభించే విధంగా చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నట్లుగానే పవన్ యాత్రకు వస్తున్న స్పందనను బట్టి అర్థమవుతుంది.