‘హెలికాప్టర్ ‘ కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

తెలంగాణ మంత్రుల మధ్య హెలికాప్టర్ పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.సీఎం తో పాటు 11 మంది మంత్రులు దూర ప్రాంతాల పర్యటనకు వెళ్లేందుకు హెలికాప్టర్ ను వినియోగించుకునే అవకాశం ఉంది.

అయితే కేవలం కొంతమంది మంత్రులకు మాత్రమే ఆ హెలికాప్టర్ వాడే అవకాశం దక్కుతుండడం,  మిగతా వారికి అవకాశం దక్కకపోవడం పై కొంతమంది మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన లేనప్పుడు ఖాళీగా ఉన్న హెలికాప్టర్ ను మంత్రులు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కాకపోతే ఒక మంత్రి కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు,  ఉన్నతాధికారులు కలిసి హైదరాబాద్ కు దూరంగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావలసి వచ్చినప్పుడు హెలికాప్టర్లు (helicopter)వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అయితే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఏ నిబంధనలు లేవని అధికారులు చెబుతున్నారు. """/" / కొన్ని కీలక శాఖలకు సంబంధించి ఆ బాధ్యత నిర్వహిస్తున్న మంత్రులు తరచుగా హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు.

దూర ప్రాంతాలకే కాకుండా దగ్గరలో ఉన్న జిల్లాలకు హెలికాప్టర్ వినియోగిస్తున్నారు.తరచుగా నలుగురు,  ఐదుగురు మంత్రులు మాత్రమే హెలికాప్టర్ ను వినియోగిస్తుండడం మిగతా మంత్రులకు ఆ అవకాశం దక్కకపోవడంతోనే ఇప్పుడు ఈ హెలికాప్టర్ పంచాయతీ తెరపైకి వచ్చింది.

సీఎం లేకపోతే మంత్రులు బృందం వెళ్లే ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వ హెలికాప్టర్ ను ఉపయోగిస్తుంటారని అధికారులు చెబుతున్నారు కానీ కొంతమంది మంత్రులు మాత్రం సాధారణ ప్రభుత్వ కార్యక్రమాలకు , దగ్గరలో ఉన్న జిల్లాకు వెళ్లి హెలికాఫ్టర్ ను ఉపయోగిస్తున్నారు.

మిగతా మంత్రులకు ఇవ్వకపోవడం పైన వివాదం నెలకొంది.కొంతమంది మంత్రులు దూరంలో ఉన్న జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చినా, హెలికాప్టర్ ఇవ్వడం లేదని కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని  , మిగతా వారిపై వివక్ష చూపుతున్నారని ప్రోటోకాల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి కి కొంతమంది మంత్రులు ఫిర్యాదు చేశారట.

దీంతో అప్పటి నుంచి తరచుగా హెలికాప్టర్ ఉపయోగించే కొంతమంది మంత్రులు సైతం రోడ్డు మార్గంలనే వెళ్తున్నారట.

ఈ హెలికాప్టర్ పంచాయతీ పెరగకుండా, మొత్తం మంత్రులందరికి ఆ అవకాశం లేకుండా చేసి ఈ వివాదం మరింత ముదరకుండా  రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారట.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్