కవిత విషయంలో కే‌సి‌ఆర్ ప్లాన్ అదేనా ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతునన్న కొద్ది అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS Party ) గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బి‌ఆర్‌ఎస్ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.

అందుకే పార్టీ బలాబలహీనతలపై కే‌సి‌ఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో పక్కా ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తున్నట్లు టాక్.

ఇదిలా ఉంచితే గత కొన్ని రోజులుగా బి‌ఆర్‌ఎస్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంశం ఎమ్మెల్సీ కవిత డిల్లీ లిక్కర్ స్కామ్.

"""/" / ఈ స్కామ్ లో కవిత( Kavitha ) పేరు పేరు చేర్చి ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారించింది కూడా.

అయితే కే‌సి‌ఆర్ ను దెబ్బ తీసేందుకే కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు జరుగుతున్నాయని మోడీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బి‌ఆర్‌ఎస్ ఆరోపిస్తున్నప్పటికి.

ప్రజల్లో మాత్రం కే‌సి‌ఆర్ కుటుంబం పై అవినీతి మరక అంటుకుంది.దీంతో కవిత లిక్కర్ స్కామ్ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన కే‌సి‌ఆర్.

ఆమె విషయంలో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. """/" / ఎమ్మెల్సీ గా ఉన్న కవితను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై కే‌సి‌ఆర్ ఆలోచిస్తున్నట్లు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అన్నీ కుదిరితే నిజామాబాద్ అర్బర్ నుంచి కవిత ను ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గణేశ్ గుప్తా( Ganesh Gupta ) ఉన్నారు.

ఒకవేళ కవిత అక్కడి నుంచి బరిలోకి దిగితే గుప్తా సీటు సీటు త్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నారట.

ఇప్పటికే నిజామాబాద్ లో సర్వేలు కూడా చేయించినట్లు సమాచారం.మరి లిక్కర్ స్కామ్ ఉచ్చులో ఇరుకున్న కవిత ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

మొత్తానికి కవిత విషయంలో కే‌సి‌ఆర్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయో మరి.

పవన్ జీ.. ప్రసాదంతో పాటు ఇవి కూడా ఇవ్వండి.. షాయాజీ షిండే షాకింగ్ కామెంట్స్ వైరల్!