ఇదేందయ్యా ఇది.. పెళ్లిలో విచిత్రమైన డ్యాన్స్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్!

ఇదేందయ్యా ఇది పెళ్లిలో విచిత్రమైన డ్యాన్స్ చేసిన వ్యక్తి వీడియో వైరల్!

ప్రస్తుతం ఓ పెళ్లి వేడుకలో ఓ విచిత్రమైన డ్యాన్స్‌ని చూపించే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఇదేందయ్యా ఇది పెళ్లిలో విచిత్రమైన డ్యాన్స్ చేసిన వ్యక్తి వీడియో వైరల్!

ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే దాదాపు 4 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

ఇదేందయ్యా ఇది పెళ్లిలో విచిత్రమైన డ్యాన్స్ చేసిన వ్యక్తి వీడియో వైరల్!

"ట్రైనింగ్ ముగిసిన వెంటనే జవాన్ తన ఫ్రెండ్ పెళ్లి బరాత్‌కు విచ్చేశాడు అనుకుంటా" అని కాబ్రా ఈ వీడియోకి ఒక ఫన్నీ క్యాప్షన్ జోడించారు.

వైరల్ గా మారిన 29-సెకన్ల వీడియోలో పెళ్లి వాయిద్యాలు వాయిస్తూ ఉండగా ఒక వ్యక్తి డ్యాన్స్ చేయడం గమనించవచ్చు.

ఇతని స్టెప్పులు చూస్తే అది నిజంగా డ్యాన్స్ ఏనా? అనే అనుమానం కలగక మానదు.

ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరూ చేయని విధంగా పెళ్లి వేడుకలో మార్చ్ పాస్ట్‌ను చేశాడు.

జవాన్లు మాదిరి మార్చింగ్ తో పాటు సెల్యూట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

అతను కొన్ని అడుగులు వెనక్కి వేసి చిత్రవిచిత్రమైన డ్యాన్స్ చేస్తూ అక్కడున్న వారిని నవ్వించాడు.

అంతేకాదు, క్రికెట్ మ్యాచ్‌లో బంతిని విసిరేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ వ్యక్తి తన చేతిని కూడా కదిలించి ఇది కూడా ఒక స్టెప్పేనని నిరూపించాడు.

ఆ తరువాత ఈ వ్యక్తి ఒక స్కూల్ పీటీ లాగా వ్యాయామం చేశాడు.

అయితే ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు.అలానే ఆ వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు.

కానీ ఈ వీడియో మాత్రం నెటిజన్లను బాగా నవ్విస్తోంది.ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025