ఇదేందయ్యా ఇది.. తిట్టేది వాళ్లే, డిప్రెషన్ లోకి వెళ్ళేది కూడా వాళ్లేనా?

అలేఖ్య చిట్టి పికిల్స్.ప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో చూసిన దీనిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పచ్చళ్ల ధర ఎంత ఎక్కువగా పెట్టారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరముండగా, ప్రత్యుత్తరంగా బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ పంపిన ఓ అమ్మాయి ఆడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వ్యవహారం అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మొత్తాన్ని కుదిపేసింది.అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడే వారు వీరి పికిల్స్‌ను తప్పక ట్రై చేస్తుంటారు.

రాజమండ్రిలో ఈ వ్యాపారం జరుగుతోంది.దేశ విదేశాల్లోనూ వీరి పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంది.

వాట్సాప్ ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేస్తే, పచ్చళ్ల వివరాలు, ధరలు పంపిస్తారు.అయితే ఇటీవల, ఓ వ్యక్తి నాన్ వెజ్ పచ్చళ్ల ధర అధికంగా ఉండడంపై సందేహం వ్యక్తం చేస్తూ "మీ పచ్చళ్ల ధరలు ఎందుకు ఎక్కువ?" అంటూ ప్రశ్నించాడు.

పైగా, రెండు చేతులు జోడించిన ఎమోజీని కూడా జతచేశాడు.దీనిపై అక్కడి నుంచి వచ్చిన సమాధానం మాత్రం ఎవరు ఊహకు అందని విధంగా ఉంది.

ఓ అమ్మాయి బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చింది.ఈ ఆడియో ఒకసారి బయటకు రావడంతో, ఆ వ్యాపారం ఒక్కసారిగా నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది.

ఈ వివాదానికి సంబంధించిన ఆడియో లీక్‌ కావడంతో, అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం విమర్శలకు గురైంది.

"కస్టమర్ క్వశ్చన్ అడిగితే ఇలా తిట్టాలా?" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.వ్యాపారం చేసే వారు తమ కస్టమర్లతో మర్యాదగా మాట్లాడాలని, లేదంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని చెబుతున్నారు.

ఈ ట్రోలింగ్ ప్రభావంతో, అలేఖ్య చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు అకౌంట్ డిలీట్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రిక్వెస్ట్‌లను కూడా అంగీకరించడం లేదని సమాచారం.అంతేకాకుండా, వీరి అధికారిక వెబ్‌సైట్ కూడా పనిచేయడం లేదట.

అంటే, తాత్కాలికంగా అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయినట్లే. """/" / ఈ వ్యాపారం రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి నడుపుతున్నారు.

సోషల్ మీడియాలో వీరికి బాగా ఫాలోయింగ్ ఉండడం వల్ల, బిజినెస్ కూడా బాగానే కొనసాగుతోంది.

అయితే, ఈ వివాదం ఊహించని దిశగా మలుపు తిరిగింది.ఈ వివాదంపై అలేఖ్య చిట్టి సిస్టర్స్‌లో ఒకరు సుమీ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ఆమె ఓ వీడియోలో స్పందించారు.

ఈ వివాదం గురించి నాకేం తెలియదు.అసలు ఏం జరిగిందో కూడా తెలియదు.

నా చెల్లిని ఫోన్ చేసి అడిగితే, రెండు రోజులు తనతో మాట్లాడొద్దని చెప్పి ఫోన్ పెట్టేసింది అంటూ క్లారిటీ ఇచ్చారు.

"""/" / తనను, తన ఫ్యామిలీని ఈ వివాదంలోకి లాగడం తగదని, నా భర్త ఫోటోలు పెట్టడం, వ్యక్తిగతంగా బెదిరించడం ఏమిటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను నా చెల్లి చేసిన తప్పును సమర్థించట్లేదు.కానీ, ‘చంపేస్తాం’, ‘రేప్ చేస్తాం’ అనే బెదిరింపు మెసేజ్‌లు పంపడం ఎంత వరకు న్యాయం? అంటూ ఆమె నెటిజన్లపై ఫైర్ అయ్యారు.

మొత్తానికి టివల్లే తిట్టి వాళ్లే కోపడ్డం ఇప్పుడు చర్చింయాంశంగా మారింది.