ఆర్జీవీ ఈ బయోపిక్‌లో అయినా జెన్యూనిటీ ఉంటుందా?

ఈమద్య కాలంలో వర్మ సినిమా అంటే జనాలు పట్టించుకోవడం లేదు.ఆయన సినిమాల గురించి జనాల్లో అసలు ఆలోచనే లేదు.

ఏం సినిమా చేసిన వివాదం లేదా డబ్బుల కోసం ఆయన చేస్తున్నాడు.అందుకే ఆయన సినిమాల విషయంలో అస్సలు జనాలు కనీస ఆసక్తిని కూడా కలిగి లేరు అనడంలో సందేహం లేదు.

వర్మ చేసిన గత రెండు మూడు ఏళ్లలో చేసిన ఏ ఒక్క సినిమాను కూడా జెన్యూన్‌గా చేయలేదు అనిపిస్తుంది.

రామ్‌ గోపాల్‌ వర్మ చేస్తున్న సినిమాలు అన్ని కూడా ఆయన పబ్లిసిటీ కోసం, ఏదో ఒక వివాదం కోసం అంటూ టాక్‌ ఉంది.

ఇప్పుడు ఆయన బయోపిక్‌ రాబోతుంది.అది కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణలోనే రాబోతుంది.

వివాదాల దర్శకుడి సినిమా అంటే ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉండాలి.కాని వర్మ ఈ సినిమాను అయినా జెన్యూన్‌గా తీయిస్తాడా లేదా అనేది అనుమానంగా ఉంది.

తేజ అనే యువ దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు.వర్మ పాత్రలో కనిపించడంతో పాటు అతడే దర్శకత్వం వహించబోతున్నాడు.

చాలా సినిమాలు ఈమద్య కాలంలో వర్మ ఇతరుల దర్శకత్వంలో చేస్తూ తాను ఇంటర్‌ ఫియర్‌ అవుతున్నాడు.

ఇలాగే 'రాము' సినిమాకు కూడా వర్మ అలాగే చేస్తాడా అనేది చూడాల్సి ఉంది.

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పూర్తి స్థాయి బయోపిక్‌ ను రెండు పార్ట్‌ లుగా తీయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

మొదటి పార్ట్‌లో తేజ వర్మ పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించబోతున్నాడు.

దాదాపు 20 ఏళ్ల వయసు ఉన్న తేజకు ఇంత పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది.

మరి ఆయన ఏం చేస్తాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.వర్మ ఈ సినిమాలో జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా సినిమా మళ్లీ అటకెక్కినట్లే అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

రామ్‌ గోపాల్‌ వర్మ ఈ సినిమా పై ఎలాంటి జోక్యం లేనప్పుడే సినిమా జెన్యూన్‌గా వచ్చినట్లుగా ప్రేక్షకులు భావిస్తారు.

ఉన్నది ఉన్నట్లుగా తీస్తారా లేదా అనేది చూడాలి.

ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేయడాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ..