Superstar Krishna : కృష్ణ లాంటి హీరో ఇండస్ట్రీ లో లేరా..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి నటులు వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇక వీళ్ళ తర్వాత కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి వాళ్లు కూడా మంచి సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చారు.

ఇక వీళ్ళు నలుగురు ఇండస్ట్రీలో నాలుగు పిల్లర్లుగా కొనసాగారు.అయితే ఆ జనరేషన్ లో సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూనే కొత్తగా ఇండస్ట్రీకి ఏదైనా తీసుకురావాలి అంటే ఆయనే ముందుండి మరి వాటిని ఇండస్ట్రీకి తీసుకొచ్చేవారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట కౌబాయ్ సినిమా( Cowboy Movie ) చేసింది ఆయనే, మొదట కలర్ సినిమా( Color Movie ) చేసింది కూడా ఆయనే, ఇలా ఇండస్ట్రీకి కొత్తగా ఏది వచ్చిన దాన్ని కృష్ణ తీసుకురావాల్సిందే అనేంత లా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

"""/" / ఇక ఇప్పుడున్న హీరోలు మాత్రం కొత్తదనం ఏమీ లేకుండా నార్మల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

కానీ ఒకప్పుడు కృష్ణ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా చాలా రిస్క్ చేసేవాడు.

కానీ ఇప్పుడున్నటువంటి హీరోలు అసలు రిస్క్ అంటే ఏంటో కూడా అర్థం కాకుండా మూస దోరణి లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

ప్రస్తుతం మన సినిమాలు పాన్ ఇండియా( Pan India ) స్థాయిలో మంచి విజయాలను అందుకుంటున్నప్పటికీ, ఒకప్పుడు కృష్ణ చేసిన సాహసాల ముందు ఇవన్నీ పిల్లి మొగ్గలే అంటూ మరి కొంత మంది మన హీరోలను విమర్శిస్తున్నారు.

"""/" / అప్పుడు కృష్ణ మూడు షిఫ్ట్ లు చేస్తూ వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చాడు.

ఒక సంవత్సరంలో ఏకంగా 18 సినిమాలను రిలీజ్ చేశారంటే మామూలు విషయం కాదు.

ఇక ఇప్పుడున్న హీరోలు వాళ్ల ఎంటైర్ కెరియర్ లో 18 సినిమాలు చేస్తారో లేదో కూడా క్లారిటీ లేకుండా పోయింది.

అందుకే ఇప్పుడున్న హీరోల్లో కృష్ణలాంటి తెగువ ఉన్న హీరోలు ఎవరు కనిపించడం లేదంటూ మన హీరోల మీద విమర్శలు అయితే చేస్తున్నారు.

ట్యాక్స్ కట్టకుండా ఉండాలా.. ఈ ట్రావెల్ బ్లాగర్ హిలేరియాస్ అడ్వైస్ వినండి..?