శ్రీ వెంకటేశ్వర జపం ఉందా..? అది ఎలా చేయాలి..?

శ్రీ వేంకటేశ్వరాయ నమః అనేది వేంకటేశుడి మంత్రం.ఈ అష్టాక్షరీ మంత్రం గురించి మాతృశ్రీ వెంగమాంబ రాసిన శ్రీ వేంకటాచల మహాత్మ్యం అన్న గ్రంథంలోని తృతీయ అశ్వాసంలో 177వ పుటలో శ్రీ వేంకటేశ్వరాయ నమః అనే అష్టాక్షరీ మంత్రం గురించి ప్రస్తావించారు.

శ్రీనివాసుడి ఈ మంత్రాన్ని ఓంకార పూర్వకంగా జపించవచ్చునని అందులో పేర్కొన్నారు.అంగన్యాస కరన్యాసాదులతో జపం చేసి ధ్యానం, ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం లాంటి షోడశోపచారాలు కావించాలి.

శ్రీవేంకటేశ్వరాయనమః అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 జపించాలి.పాదాలు మొదలు తల వరకు సర్వాంగాలనూ స్వామి వారికి అర్చించాలి.

ధూప దీప నైవేద్యాలు ఏడు కొండల వాడికి సమర్పించాలి.లక్షల జపము చేస్తే పునశ్చరణ అవుతుందని పండితులు చెబుతారు.

కర్పూర నీరాజనం చేసి మంత్రి పుష్ప ప్రదక్షిణ నమస్కారాలు చేసి స్వామి వారిని పూజించాలి.

మనస్సును లఘ్నం చేసి ధ్యానం చేయాలి.ఇలా చేస్తే ఆ తిరుమలేశుడి అనుగ్రహం మన యందు ఎల్లవేళలా సిద్ధిస్తుందని అంటారు పండిత నిపుణులు.

శ్రద్ధతో కూడిన భక్తితో.స్వామి వారి యందు పూర్తి విశ్వాసం ఉంచి చేసే పూజలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

గురు ముఖంగా మంత్రం గ్రహించి శ్రీవేంకటేశ్వరాయనమః అనే స్వామి వారి మంత్రాన్ని జపిస్తే.

కృతార్థత సిద్ధిస్తుందని ప్రతీతి.కేవలం శ్రీ శ్రీనివాసుడి నామ జపం కూడా అష్టాక్షరీ మంత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుంది.

మంత్రంతో జపం చేసినా.నామ జపం చేసినా.

ఆపద్భాంధవుడిపై పూర్తి విశ్వాసం ఉంచి.ఆయన సేవలో తరించి తమను తాము మరచిపోయినప్పుడే స్వామి కటాక్షం సిద్ధిస్తుంది.

37 రోజులుగా శిబిరాల కింద ఉన్నా బతికిన బిడ్డ.. గాజాలో మిరాకిల్..