రవితేజ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ వచ్చినట్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రవితేజ.

( Ravi Teja ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా వైవిద్యభరితమైన ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ఇక రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'మిస్టర్ బచ్చన్'( Mr.Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక దాంతో పాటుగా అనుదీప్ డైరెక్షన్ లో 'దొంగ - పోలీస్' అనే మరొక సినిమా కూడా కమిట్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక దాంతో పాటుగా మరొక సినిమాని కూడా రవితేజ కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.

అది ఎవరితో అంటే ఇంతకుముందు రవితేజ తో పవర్ సినిమా చేసి డైరెక్టర్ గా పరిచయమైన బాబితో ( Director Bobby ) రవితేజ నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం బాబీ బాలయ్య తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత రవితేజ తో చేసే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ లైనప్ ను కనక చూసుకున్నట్లయితే రవితేజ ప్రస్తుతం ఎవరికి తగ్గకుండా భారీ ప్రాజెక్టులను సెట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా రవితేజ కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

"""/" / ఇక రవితేజ దాదాపు సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇప్పటికే ఈగల్ సినిమాని రిలీజ్ చేశాడు.

ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేసి ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

రవితేజ వల్ల హరీష్ శంకర్ కి కొత్త కష్టాలు వచ్చాయా..?