ఆస్కార్ వేడుకలలో రామ్ చరణ్ ఉపాసన కాస్ట్యూమ్ వెనుక ఇంత స్టోరీ ఉందా?

రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి చివరికి ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.

95 వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలను లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.

ఇక ఈ వేడుకలలో RRR చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.ఇక ఈ వేడుకలలో భాగంగా రామ్ చరణ్(Ram Charan) తో పాటు ఆయన సతీమణి ఉపాసన(Upasana) కూడా పాల్గొన్నారు.

ఇక వీరిద్దరూ ఆస్కార్ వేడుక కోసం స్పెషల్ డిజైనర్ దుస్తులలో సందడి చేశారు.

"""/" / ఈ క్రమంలోనే రామ్ చరణ్ బ్లాక్ సూట్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించగా ఉపాసన మాత్రం క్రీమ్ కలర్ చీర ధరించి హిందూ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

అయితే ఇలా వీరిద్దరూ ఆస్కార్ వేడుకలలో(Oscars) భాగంగా ఇలాంటి కాస్ట్యూమ్ ధరించడానికి ఓ కారణం ఉందని తెలుస్తుంది.

రామ్ చరణ్ ధరించిన ఈ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ శాంతను, నిఖిల్ రూపొందించారు.

ఆర్ ఆర్ ఆర్‌లో ఆయన కేరక్టర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ వస్త్రాలను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.

మెడాలియన్ బటన్స్, చక్రాల్లాంటి బ్రోచెస్ కాస్ట్యూమ్స్ కి స్పెషల్ అడిషన్‌లా అనిపించింది. """/" / ఇక ఉపాసన ధరించిన చీరను జయంతి రెడ్డి అనే డిజైనర్ తయారు చేశారు.

స్క్రాప్ రీసైలిక్డ్ సిల్క్ శారీని ఉపాసన ఆస్కార్ వేడుకలలో ధరించారు.ప్రకృతిని పరిరక్షించాలన్న ఆలోచన ఉపాసనలో స్వతహాగా ఉంటుంది.

కార్బెన్ ఫుట్‌ప్రింట్స్ తో భూమిని కలుషితం చేయకూడదన్నది ఆమె నమ్మే సిద్ధాంతం.అందుకే ఉపాసన యాక్సెసరీస్‌లోనూ స్క్రాప్‌తో తయారు చేసిన చీరను ధరించారు.

ముంబైకి చెందిన డిజైనర్ బినా గోయెంకా సిద్ధం చేసిన లిలియమ్ నెక్‌పీస్ కూడా ఈమె ధరించారు.

దీని విలువ దాదాపు 400 కేరట్ల హై క్వాలిటీ రూబీస్‌, జెమ్ స్టోన్స్, ముత్యాలతో తయారు చేశారని తెలుస్తుంది.

ఇలా వీరిద్దరూ ఆస్కార్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ దుస్తులలో సందడి చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

వైరల్: మరో ఆణిముత్యం.. పరీక్షలలో సమాధానాలు మాములుగా రాయలేదుగా..