ఆశిష్ విద్యార్థి ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత స్టోరీ ఉందా?
TeluguStop.com
ప్రస్తుత కాలంలో సినిమా సెలబ్రిటీలు ఆరు పదుల వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
ఇలా లేటు వయసులో ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుందని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ఆశిష్ విద్యార్థి ( Ashish Vidyarthi ) రూపాలి ( Rupali )అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా ఈయన 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
"""/" /
ఈ విధంగా ఆశిష్ విద్యార్థి రూపాలిని ఈ వయసులో పెళ్లి చేసుకోవడం వెనుక ఓ కారణముందని తెలుస్తోంది.
పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి తన రెండో పెళ్లి( Second Marriage ) గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లి అంత ఈజీగా ఏమీ జరగలేదని తెలిపారు.
ఈ పెళ్లి సమయంలో తాను ఎంతో బాధను అనుభవించానని తెలియజేశారు.గత ఏడాది జరిగిన వ్లాగింగ్ అసైన్మెంట్ లో భాగంగా నేను రూపాలిని కలిశానని ఆశిష్ తెలియజేశారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయమే ఏర్పడటం ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకోవడం జరిగింది.
ఇక రూపాలి కూడా ఐదు సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయి ఎంతో బాధను అనుభవించిందని తెలిపారు.
"""/" /
ఇలా భర్త మరణం నుంచి బయటపడిన రూపాలి తనుకు దగ్గర అయిందని, ఇలా ఒకరోజు చాట్ చేసుకుంటూ ఉండగా తనని నా జీవితంలోకి ఆహ్వానించి తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నానని చెప్పాను.
ఆమె కూడా నా నిర్ణయానికి ఒప్పుకొని నాతో జీవితం పంచుకుందని ఇలా రూపాలి తన జీవితంలోకి రావడం తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని ఆశిష్ విద్యార్థి వెల్లడించారు.
అయితే నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానన్న సంఘటన తన కుటుంబ సభ్యులను ఎంతో బాధ పెట్టిందని ఆశిష్ విద్యార్థి తెలియజేశారు.
ఇక తన మొదటి భార్య పిలూను తాను ఒక భార్యలా కాకుండా ఎప్పుడు స్నేహితుడిగానే తనతో చాలా సరదాగా ఉండేవాడిని అయితే తనని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితమే మారిపోయిందని, తన నుంచి విడిపోయే సమయంలో ఎంతో బాధపడ్డానని, ఇద్దరికీ చాలా కష్టంగా అనిపించిందని ఈయన తన రెండో పెళ్లికి ముందు పడిన బాధ గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ధనుష్ పై సంచలన పోస్ట్ చేసిన విగ్నేష్… కాసేపటికే డిలీట్… ఏమైందంటే?