‘బాహుబలి’ సినిమాతో ‘దేవర’ క్లైమాక్స్ కి లింక్ ఉందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్!

సుమారుగా ఆరేళ్ళ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr Ntr )నుండి ఇప్పటి వరకు సోలో సినిమా రాలేదు.

ఈ సినిమా కోసం ఆయన మూడేళ్లు కేటాయించాడు.ఆ సినిమా గ్రాండ్ హిట్టై ఎన్టీఆర్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ( Koratala Siva ) తో కలిసి 'దేవర' అనే చిత్రం చేస్తున్నాడు.

ఈ సినిమా రీసెంట్ సమయం లోనే ప్రారంభమై శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ, వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

'ఆచార్య' వంటి ఘోరమైన డిజాస్టర్ టాక్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో చేస్తున్న చిత్రం ఇది.

హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటుగా , ఫైట్ మాస్టర్స్ మరియు కెమెరామెన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

"""/" / ఈ చిత్రం లో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లో తెరకెక్కించారు.

సినిమా కథ పెద్దది కాబట్టి, రెండు భాగాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా డైరెక్టర్ కొరటాల శివ రీసెంట్ గానే ప్రకటించారు.

ముఖ్యంగా ఈ సినిమా లో వచ్చే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా ఉంటాయట.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా క్లైమాక్స్ కి అలాగే బాహుబలి క్లైమాక్స్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయని లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.

బాహుబలి క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలి కి వెన్నుపోటు పొడిచి ఎలా అయితే చంపేసి ఊహించని ట్విస్ట్ ఇస్తారో, 'దేవర' చిత్రం లో కూడా అలాంటి ట్విస్ట్ ఉండబోతుంది అట.

"""/" / ఈ ట్విస్ట్ చూసిన తర్వాత దేవర పార్ట్ 2( Devara ) కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందని అంటున్నారు.

ఆ రేంజ్ లో ప్లాన్ చేసాడట డైరెక్టర్ కొరటాల శివ.ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ని ఎలా చూపిస్తే అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా విజిల్స్ వేస్తారో, అలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ కొరటాల శివ.

మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి మెయిన్ లీడ్ ఫస్ట్ లుక్స్ మొత్తం విడుదల అయ్యాయి.

ఇప్పుడు అభిమానులు ఆతృతగా టీజర్/ లేదా గ్లిమ్స్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

అధిక కొలెస్ట్రాల్ వ‌ల్ల త‌లెత్తే స‌మ‌స్య‌లేంటి.. కొలెస్ట్రాల్‌ను ఎలా త‌గ్గించుకోవాలి?